Bandi Sanjay And KCR : టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్: పందికి లిప్ స్టిక్ వేసినట్లు.!

NQ Staff - October 5, 2022 / 04:52 PM IST

Bandi Sanjay  And KCR : టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్: పందికి లిప్ స్టిక్ వేసినట్లు.!

Bandi Sanjay And KCR : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీద సెటైర్లు మామూలుగా వేయలేదు. కేసీయార్ సహా కేటీయార్ మీద కూడా ‘ట్విట్టర్ టిల్లు’ అంటూ పంచ్ డైలాగులు పేల్చారు ట్విట్టర్ ద్వారా బండి సంజయ్.

తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా, భారత రాష్ట్రీయ సమితిగా మారుతున్న సంగతి తెలిసిందే. అంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితి అవుతుందన్నమాట.

మరీ పందికి లిప్ స్టిక్ అనేశారంటేబబ్బా.?

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రీయ సమితిగా కేసీయార్ మార్చడం పట్ల స్పందించిన బండి సంజయ్, ‘పందికి లిప్ స్టిక్ వేసినట్లుంది’ అంటూ సెటైరేశారు సోషల్ మీడియా వేదికగా. ఇది మరీ టూ మచ్ కదా.?

పార్టీ పేరు మార్చి.. గేమ్ ఛేంజర్ అంటున్నారు.. కానీ, తండ్రి.. నేమ్ ఛేంజర్ అయ్యారు.. కానీ, వాళ్ళ ఫేట్ మార్చేవాళ్ళే ప్రజలు.. అంటూ బండి సంజయ్ సెటైర్ వేశారు.

మిగతా విమర్శలన్నీ ఓ యెత్తు.. పందికి లిప్ స్టిక్ వేసినట్లు.. అనే పోలిక ఇంకో యెత్తు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. రాజకీయాల్లో సెటైర్లకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది మరి.!
అనేక వ్యయప్రయాసలకోర్చి జాతీయ రాజకీయం చేయాలనుకుంటున్న కేసీయార్ విషయంలో ‘పందికి లిప్ స్టిక్ వేసినట్లు..’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us