PM Narendra Modi : బిగ్ షాక్: మోడీ హైద్రాబాద్ పర్యటన వాయిదా.!
NQ Staff - January 11, 2023 / 12:23 PM IST

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మడీ ఈ నెల 19న హైద్రాబాద్ రావాల్సి వుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖకు కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ రైలుని ప్రధాని మోడీ ప్రారంభించాల్సి వుంది.
హైద్రాబాద్‌లో ప్రధాని పర్యటన కోసం బీజేపీ శ్రేణులు, ప్రభుత్వ యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతున్నవేళ, షాకింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ప్రధాని హైద్రాబాద్ పర్యటన వాయిదా పడినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రధాన మంత్రి కార్యాలయం సమాచారమిచ్చింది.
పర్యటన వాయిదా.. మళ్ళీ ఎప్పుడు.?
కాగా, ప్రధాని మోడీ హైద్రాబాద్ పర్యటన వాయిదా పడిందనీ, మళ్ళీ పర్యటన ఎప్పుడనేది త్వరలో వెల్లడవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.
వందే భారత్ రైలుని ప్రారంభించడంతోపాటు, తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతోనూ ప్రధాని మోడీ భేటీ అవ్వాల్సి వుంది. ప్రధాని మోడీ హైద్రాబాద్ పర్యటన కోసం తెలంగాణ బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లకు సిద్ధమవుతున్న వేళ, ప్రధాని పర్యతన వాయిదా.. అంటూ ప్రకటన వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్రధాని ర్యటన వాయిదా నేపథ్యంలో ఈ నెల 19న ప్రారంభమవుతుందా.? లేదా.? అన్నది సస్పెన్స్‌గా మారింది. వర్చువల్ విధానంలో ప్రధాని ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారా.? లేదంటే, ఇంకో రోజు ముహూర్తం ఖరారవుతుందా.?