Bandi Sanjay : మరిన్ని ఉప ఎన్నికలొస్తాయ్ : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

NQ Staff - August 4, 2022 / 07:49 PM IST

Bandi Sanjay : మరిన్ని ఉప ఎన్నికలొస్తాయ్ : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 మంది వరకు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వచ్చారని బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు చెబతోన్న విషయం విదితమే.

ఇటీవలే ‘చేరికల కమిటీ’ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అధిష్టానానికి, బీజేపీలో చేరాలనుకుంటున్న తెలంగాణ ప్రజా ప్రతినిథుల వివరాల్ని అందజేసిన విషయం విదితమే.

బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైనవారికే..

Bandi Sanjay Comments There be by Elections in More Constituencies in Telangana

Bandi Sanjay Comments There be by Elections in More Constituencies in Telangana

చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనీ, అయితే వ్యక్తిగత ప్రతిష్టను పక్కన పెట్టి.. పార్టీ బాగు కోసం ఎవరైతే పని చేస్తారో అలాంటివారినే బీజేపీలోకి తీసుకుంటామనీ, టిక్కెట్లను ఖరారు చేసేది బీజేపీ అధిష్టానమనీ బండి సంజయ్ చెబుతున్నారు.

తెలంగాణలో తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పిన బండి సంజయ్, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమనీ, అధికారంలోకి వచ్చాక.. టీఆర్ఎస్ అవినీతిని వెలికి తీసి, దోషుల్ని శిక్షిస్తామని అన్నారు.

నయీం గ్యాంగ్ ఆస్తుల్ని ఎవరూ కొనుగోలు చేయవద్దనీ, అలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us