Balakrishna : పొట్టి, పొడుగు.! పబ్జీ, వాలీబాల్.! వైఎస్ జగన్‌ని టార్గెట్ చేసిన బాలకృష్ణ.!
NQ Staff - October 14, 2022 / 11:00 PM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్‌స్టాబుల్’ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌లో కావాలనే కొన్ని డైలాగుల్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డిజైన్ చేసినట్లున్నారు. వైసీపీ అధినేతని టార్గెట్ చేస్తూ, ‘పబ్జీ’ డైలాగ్ పెట్టించారు. ఇది చంద్రబాబు నిర్వాకమా.? బాలయ్య పైత్యమా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘మీరు పబ్జీ ఆడతారా.?’ అంటూ ఒకటికి రెండు సార్లు నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు.
‘స్నేక్స్ అండ్ ల్యాడర్’ అయినా ఆడతారా.? అని మరోసారి ప్రశ్నించారు బాలయ్య. ‘స్పోర్ట్స్ ఏం ఆడతారు.?’ అని బాలయ్య అడిగితే, ‘చిన్నప్పుడు సంప్రదాయ ఆటలైన కబడ్డీ ఆడేవాడిని.. పొడుగ్గా వుంటాను కదా, వాలీబాల్ ఆడేవాడిని..’ అని చెప్పారు చంద్రబాబు.
పొట్టి అంటే వైఎస్ జగన్‌ని ఉద్దేశించేనా.? వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పదే పదే పరోక్షంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘పొట్టి’ అనే మాట ఉపయోగిస్తుంటారు. రఘురామ కృష్ణరాజుకి స్క్రిప్ట్ టీడీపీ నుంచే వెళుతుంటుందన్నది వైసీపీ విమర్శ. ఈ నేపథ్యంలో, ‘పబ్జీ, పొడుగు – పొట్టి’ వంటి మాటలు టీడీపీనే కావాలని ‘అన్‌స్టాపబుల్’లో ప్రస్తావనకు వచ్చేలా చేసిందన్నది వైసీపీ ఆరోపణగా కనిపిస్తోంది.
పైగా, ‘తాడేపల్లి ప్యాలెస్‌లో వైఎస్ జగన్ పబ్జీ ఆడుతాడు..’ అంటూ పదే పదే టీడీపీ విమర్శలు చేస్తుంటుంది. ఆ క్రమంలోనే పబ్జీ అంశాన్ని బాలకృష్ణ ప్రస్తావించారనీ, అలా బాలయ్య ప్రస్తావించేలా చంద్రబాబు చేశారనీ అంటున్నారు.