అల్లుళ్ళ కోసం బాలయ్య బాబు టీడీపీ లో కీలకంగా పనిచేయనున్నాడా..!
Admin - October 31, 2020 / 04:47 PM IST

టీడీపీ వ్యవస్థాపకులు, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు అటు నటనలోనూ ఇటు రాజకీయాల్లోనూ తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా నటనలో ఏమాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ కొడుకులాగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒక నటనలోనే కాకుండా ఒకవైపు రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఎన్టీఆర్ తరువాత టీడీపీ బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు చేపట్టి ఆ పార్టీని నడిపిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం చంద్రబాబుకు వయస్సు మీద పడుతుండడంతో తరువాత బాధ్యతలు ఎవరికి అప్పగిస్తాడా అని అందరికి సందేహం ఏర్పడింది. ఇక దాంట్లో ఏమాత్రం డౌట్ లేకుండా పార్టీ బాధ్యతలు తన కుమారుడు నారా లోకేష్ కె అప్పగిస్తాడు ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మరి లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించిన, పెద్ద దిక్కు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక ఇది ఇలా ఉంటె లోకేష్ బాలకృష్ణ అల్లుడని అందరికి తెలిసిన విషయమే. ఇక తన అల్లుడి రాజకీయ భవిష్యత్ కోసం బాలయ్య టీడీపీ లో ముందు ఉండి నడవనున్నాడట. అయితే గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేసి ఓటమి చెందాడు.
ఓటమి చెందిన కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు లోకేష్. ఇక టీడీపీ పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్పగిస్తే బాలయ్య సాధ్యమైనంతవరకు సినిమాలు తగ్గించి రాజకీయాల్లో తన అల్లుడికోసం కీలకంగా పనిచేయనున్నాడట. అలాగే బాలయ్య రెండవ అల్లుడు భరత్ కూడా గత ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేసి ఓటమి చెందాడు. దీనితో ఇక బాలయ్య రంగంలోకి దిగి తన ఇద్దరు అల్లుళ్ళ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీలో కీలకంగా పనిచేయనున్నాడని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక బాలయ్య రంగంలోకి దిగితే టీడీపీకి కొత్త ఊపు రానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.