NTR: రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ బాలయ్యకు ఇష్టం లేదా.. అంత గ్యాప్ ఎందుకు?

NTR: తెలుగుదేశం పార్టీ.. తెలుగు ప్రజలకు ఊపిరి పోసిన పార్టీ. అలాంటి పార్టీని ప్రతిష్టించింది తెలుగు వారికి అన్నగా పేరొందిన మహానేత. ఎంతోమంది నేతలకు చేయుతగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారకరామారావు. ఆయన హయాంలో ఎన్నో ప్రజల పథకాలు, శ్రమదానం, ఉన్నతమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి. ఆయన తర్వాత చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళుగా సక్సెస్ ఫుల్ గా రాణించారు.

Balakrishna Clarity on NTR POlitical Entry
Balakrishna Clarity on NTR POlitical Entry

ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన పార్టీ రాజకీయాల గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. తెలుగు దేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు దీర్ఘంగా ఆలోచించారు. ఏదో వీడియోకి పాజ్ ఇచ్చినట్లుగా అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లో.. తెలీక ప్రేక్షకులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటికే గతంలో తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే బావుంటుందని, అటు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు, ఇటు పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇప్పుడు పార్టీకి ప్లస్ అవుతుందా.. లేదా మైనస్ అవుతుందా.. అని అడిగితే సమాధానం ఏం చెప్పకుండా చాలా గ్యాప్ తీసుకున్నారు బాలకృష్ణ. దీనిపై యాంకర్ తో పాటు ప్రేక్షకులు కూడా బాలకృష్ణ ఆలోచన ఏంటనే దానిపై షాక్ అయ్యారు.

దీనిపై సోషల్ మీడియాలో కూడా పలు కామెంట్లు వస్తున్నాయి. అందులోనూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య బాబు, ఒకవేళ అతని ఎంట్రీ ప్లస్ అయ్యి, మైనస్ అవుతుందేమో అని తికమక మకతిక రేంజ్ లో సమాధానం ఇచ్చారు. ఇంకేం ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక, బాలకృష్ణకు ఇష్టం లేదనుకుంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ ఎప్పుడూ పారదర్శకంగానే ఉంటానని.. తనతో పాటు తన కార్యకర్తలు, నేతలు కూడా ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉంటారని తెలిపారు.