TRS : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం: న్యాయమూర్తి ముందుకు నిందితులు.!
NQ Staff - October 28, 2022 / 11:17 AM IST

TRS : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు ఈ రోజు సాయంత్రం అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి యెదుట హాజరుపరిచారు. ఫరీదాబాద్‌కి చెందిన రామచంద్ర భారతి, హైద్రాబాద్‌కి చెందిన నందకుమార్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సింహయాజి ఆ ముగ్గురు నిందితులు.
పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు.. రిమాండ్ రిపోర్ట్.. నిన్న సాయంత్రం హైద్రాబాద్ శివార్లలోని ఓ ఫాం హౌస్‌లో (టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందినది) ఈ ముగ్గురు వ్యక్తులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారన్నది ప్రధాన అభియోగం. సుమారు 250 కోట్ల డీల్ కుదుర్చుకునేందుకు ఈ ముగ్గురూ వచ్చారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పలు సెక్షన్లను పేర్కొంటూ నిందితులపై రిమాడ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలను బీజేపీనే ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేయించిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తమకేమీ ఈ వ్యవహారంతో సంబంధం లేదని బీజేపీ చెబుతోంది.