లైవ్ డిబేట్ లో “చెప్పు”తో దాడి తర్వాత విష్ణువర్ధన్ ఏమి చేశాడు ..?

Vishnu vardan
Vishnu vardan

ప్రతి రోజు సాయంత్రం అన్ని మీడియా చానెల్స్ ఆ రోజు జరిగే కొన్ని ప్రధాన టాపిక్స్ మీద పార్టీలకు సంబధించిన కొందరు నేతలను స్టూడియో కి పిలిపించి వారితో డిబేట్స్ నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ABN స్టూడియో లో జరిగిన డిబేట్స్ లో పాల్గొన్న ఇద్దరు నేతలు మధ్య వాదనలు శృతిమించి చెప్పుతో దాడి చేసుకునేవరకు వెళ్ళింది.

Vishnu vardan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో కొత్త నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతిలో 50 శాతం, అంతకుమించి పూర్తై ఆగిపోయిన నిర్మాణాలను రూ.3 వేల కోట్లతో పూర్తి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి మెట్రో రీజయన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఈ పనులు అప్పగిస్తూ ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై చర్చించడానికి ఆంధ్రజ్యోతి ఛానల్ లైవ్ డిబేట్ పెట్టింది. అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ తో పాటు బీజేపీ నేత విష్ణువర్ధన్ అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు ఈ చర్చ కార్యక్రమానికి హాజరయ్యారు.

విష్ణువర్ధన్ మాట్లాడుతూ అప్పట్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, మంత్రులు వంటి వారందరూ ముంబైకి వెళ్లి గంట కొట్టు మరీ అప్పు అడుక్కునే వారు అంటూ కాస్త వెటకారం గా అప్పటి నేతలను యాచకులు గా చిత్రీకరిస్తున్నట్లుగా మాట్లాడారు. దీంతో అక్కడ డిబేట్లో పాల్గొన్న అందరూ ఆయన మాటలకు అభ్యంతరం చెప్పారు. అమరావతి జేఏసీ నేత శ్రీనివాస విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. విష్ణువర్ధన రెడ్డి ఏ మాత్రం తగ్గకుండా అమరావతి జేఏసీ నేత అయిన శ్రీనివాస్ ని పెయిడ్ ఆర్టిస్ట్ అని సంబోధించారు. దీనితో మాట మాట పెరిగి ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాస్ చెప్పు ను బిజెపి నేత మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డి మీద విసరడం అతి ఆయనకు జరగటం జరిగింది. దీనితో లైవ్ మధ్యలో ఆపేశారు .

కాసేపటికి తిరిగి లైవ్ మోడలింది, అయితే ఈ లైవ్ లో శ్రీనివాస మాత్రం లేదు. ష్ణువర్ధన్ రెడ్డి ముఖం మాడ్చుకుని కూర్చుని ఉండగా, అప్పటి ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వంటి వారు విష్ణువర్ధన రెడ్డి వంటివారు వెటకారంగా మాట్లాడటం కాస్త తగ్గించాలని హితవు పలికారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా తన భవిష్యత్తు డిబేట్ల లో శ్రీనివాస్ ని అనుమతించనని చెప్పుకొచ్చారు. అయితే డిబేట్స్ లో పాల్గొనే నేతలు తమ తమ ఎమోషన్స్ బ్యాలన్స్ చేసుకోవాలి, అలా కంట్రోల్ గా మాట్లాడే నేతలే మాత్రమే డిబేట్స్ పాల్గొనాలి. ఏది ఏమైనా ఇలా లైవ్ లో చెప్పుతో కొట్టటం అనేది మంచి చర్య కాదనే చెప్పాలి

Advertisement