మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం. తాపీతో దాడి.

ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై అత్యాయత్నం జరిగింది. అయితే మచిలీపట్నంలోని తన నివాసం లో ఆయనపై తాపీతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇక వెంటనే అప్రమత్తం అయినా తన అనుచరులు దుండగున్ని అడ్డుకున్నారు. ఇక ఆ దుండగున్ని లాక్కొని బయటకు తీసుకొచ్చారు. ఇక అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోలీసులు ఆ దాడికి పాల్గాడిన దుండగున్ని ఎందుకోసం అత్యాయత్నం చేసాడానే కోణం పై విచారణ జరుపుతున్నారు. అయితే మంత్రికి ప్రమాదం తృటిలో తప్పేసరికి తన సన్నిహితులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అయితే గతంలో మంత్రి ప్రధాన అనుచరుడు కూడా ఇదే రీతిలో అత్యా కు గురయ్యాడు. దీనితో ఒక్కసారిగా ఈ ఘటన జరిగే సరికి మంత్రి నివాసంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఆ వ్యక్తిని విచారణ జరిపి త్వరలో వివరాలు తెలుపుతామని పోలీసులు వివరించారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఆ తాపీ తో దాడి చేసిన వ్యక్తి పేరు నాగేశ్వర్ రావు అని నిర్దారణ అయింది. అతడు మద్యంమత్తులో ఉన్నందున ఈ దాడి చేసాడని సమాచారం వస్తుంది.

Advertisement