ఉమ విషయంలో జగన్ సర్కార్ సక్సెస్ అయ్యినట్లే.. మౌత్ లాక్ షురూ

టీడీపీ కీలక దేవినేని ఉమ గత రెండు రోజుల నుండి ఎక్కడ కనిపించటం లేదనే వార్తలు వెలువడ్డాయి. కర్నూల్ సీఐడి అధికారులు నమోదు చేసిన కేసులో వారు నోటీసులు ఇచ్చినా హాజరు కాని దేవినేని ఉమ.. వారికి అందుబాటులో లేకుండా పోయారు. మంగళవారం గొల్లపూడిలోని ఉమ ఇంటికి సీఐడి అధికారులు వెళ్లిన సమయంలో ఆయన అక్కడ లేకపోవటం, ఆ తర్వాత ఆచూకీ కనిపించకపోవడం జరిగింది.

devineni uma to enter in gannavaram politicsdevineni uma to enter in gannavaram politics

అరెస్ట్ కు భయపడి పారిపోయాడనే మాటలు వినిపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో మాత్రం తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు ఉమా.. మార్చి 15న కొవిడ్‌ మొదటి డోస్‌ .. ఈ నెల 15న రెందో దశ వ్యాక్సిన్‌ తీసుకున్నానని.. డాక్టర్ల సలహామేరకు కొవిడ్‌ రక్షణ చర్యలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉన్నట్లుగా చెపుతున్నారు. దీనిని బట్టి చూస్తే మరికొద్ది రోజులు ఉమ కనిపించే అవకాశం లేదని తెలుస్తుంది.

సరిగ్గా ఇదే సమయంలో పోలవరానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టం మొదలుకాబోతుంది.. పోలవరానికి ఈసారి రీ రివర్స్ టెండరింగ్ జరపబోతున్నారు. ఇందులో కొత్త కాంట్రాక్టర్‌కు భారీగా అంచనాలు పెంచి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తుంది. దీనిని టీడీపీ ఆయుధంగా వాడుకోవాలంటే ఖచ్చితంగా దేవినేని ఉమ అవసరం ఉంది. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా చేసిన ఉమా మాత్రమే దీనిపై మాట్లాడగలడు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బయటకు రావటం కష్టమనే చెప్పాలి.. ఈ విధంగా చూసుకుంటే అది వైసీపీకి ప్లస్ అనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో దేవినేని ఉమ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో రిలీఫ్ దొరికితే.. ఆయన మీడియా ముందుకు వచ్చి.. పోలవరం పెంచిన అంచనాల పైనా.. కేసులపైనా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ఉమని కట్టడి చేసే విషయంలో జగన్ సర్కార్ విజయం సాధించినట్లే అని చెప్పాలి.

Advertisement