Etela Rajender: ఈటెల అరెస్ట్.. ? కేసీఆర్ కఠిన నిర్ణయం..?

Etela Rajender రోజు రోజుకు ఈటల వర్సెస్ కేసీఆర్ ఎపిసోడ్ తీవ్ర రూపం దాల్చుతుంది. కేవలం విమర్శలు ప్రతి విమర్శలు, బర్తరఫ్ లు రాజీనామాలతో సర్దుమణుగుతుందని అనుకున్న గొడవ అరెస్టులు, జైలు దాక వెళ్లేలా కనిపిస్తుంది. ఈటెల విషయాన్నీ సీఎం కేసీఆర్ అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. రాజకీయంగా ఈటల రాజేందర్ ఎలాంటి అడుగులు వేయకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

etela rajender

గతంలో ఈటల రాజేందర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అక్కడ అవకతవకలు జరిగాయని తన మీద కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఈటెల రాజేందర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈటలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడంతో పాటు.. త్వరలో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈటల రాజేందర్ కూడా.. ఎన్ని రోజులు జైల్లో పెడతావని ఉదయం ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ను ప్రశ్నించారు.

నిజానికి దేవరయాంజాల్ భూముల విషయంలో ఈటలను ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ భావించి ఇప్పటికే విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ అలా ఆదేశాలు రాగానే.. ఇలా వెళ్లి విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎలాంటి నివేదిక కావాలంటే అలా.. నివేదిక సమర్పిస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే దేవరయాంజాల్ భూముల విషయాన్ని కదిలిస్తే.. అన్ని పార్టీల నేతల బండారం బయట పడుతుందని… రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ కొంత మందిపై చర్యలు తీసుకుని.. మిగతా వారిని పట్టించుకోకపోయినా భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని అంటున్నారు. దీనితో దేవరయాంజాల్ భూముల జోలికి వెళ్లకుండా మరోకోణంలో ఈటల ను టార్గెట్ చేయాలనీ అనుకున్నట్లు సమాచారం.

మొన్న ఎలాగైతే ఒకే సమయానికి ఈటెల భూ కబ్జా మీద మీడియాలో ఒకేసారి కధనాలు వచ్చాయో, మరో రెండు రోజుల్లో కూడా ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పటి వ్యవహారాలు కూడా కధనాల రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల కూడా ఈ విషయంలో చాలా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ తో పోరు అంటే సామాన్యంగా ఉండదని ఆయనకు తెలుసు, దాదాపు 20 ఏళ్ళు రాజకీయ బంధం వాళ్ళది, కాబట్టి కెకెయిర్ కదలికలు ఎలా ఉంటాయో ఈటల కు బాగానే తెలుసు, అందుకు తగ్గట్లు ప్రతి వ్యూహాలను కూడా ఈటల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం

Advertisement