అంబులెన్స్ నడిపిన మంత్రి పేర్ని నాని

Advertisement

మన దేశం లో హరిత హారం లాంటి మొక్కలు నాటే కార్యక్రమాలు ఎవరైనా ప్రముఖులు చేసినప్పుడు మొక్కలను స్వయంగా నాటి వారు ఆ పనిలో భాగం అని నిరూపించుకుంటారు.. ఆలా కొంత మంది ప్రముఖులు మరియు మంత్రులు ఏవైనా కొన్ని పనులు ప్రారంభించినప్పుడు ఆ పనులు మొదటగా వారి చేతుల మీదుగా జరిపించిన ఎన్నో విషయాలను మనం చూస్తూనే ఉంటాం.

అయితే ఒక మంత్రి ఏకంగా తాను ప్రారంభించిన 104 మరియు 108 అంబులెన్సు వాహనాలను థానే స్వయంగా నడిపేసాడు . దీనికి సంబంధించిన వీడియో లు మరియు ఫోటో లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. అసలెవరు ఆ మంత్రి .. ఎం జరిగిందా అన్న వివరాల్లోకి వెళితే రాష్ట్ర రవాణా మంత్రి అయినటువంటి పేర్ని వెంకట్రామయ్య మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు అంబులెన్సు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గాను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ,జిల్లా ఎస్.పీ.రవీంద్రనాథ్ బాబు,గౌరవ శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు..

ఆ విధంగా పేర్ని వెంకట్రామయ్య చేతుల మీదుగా అంబులెన్స్ లను ప్రారంభించే ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రముఖులు అందరూ కూడా ఒక్కొక్కరిగా దీని పైన ప్రసంగాలు ఇస్తూ ఇలాంటి గొప్ప పనిని చేపట్టినందుకు గాను పేర్ని వెంకట్రామయ్య ని ఎంతగానో పొగడడం జరిగింది.. అనంతరం మంత్రి పేర్ని వెంకట్రామయ్య నే తాను ప్రారంభించిన ఈ వాహనాలలో ఒక అంబులెన్సు ని స్వయంగా అతనే జిల్లా కలెక్టర్ అయిన ఇంతియాజ్ తో కలిసి నడుపుతూ పట్టన రోడ్ల వెంబడి తిరిగారు.

ఇలా ఒక మంత్రి చేపట్టిన కార్యక్రమం తన చేతుల మీతుగా ప్రారంభించడం కొత్తేమి కానప్పటికీ అంబులెన్సు ని ప్రారంభించి వాటిని తానే స్వయంగా పరీశీలించడం కోసం అంబులెన్సు ని ఇలా నడపడం అనేది మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆలా ఈయన అంబులెన్సు ని నడిపిన ఫోటో లు మరియు వీడియో లు కాస్త ఫేస్బుక్ మరియు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా లలో చక్కర్లు కొడుతున్నాయి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here