Andhra Pradesh (ఆంధ్ర ప్రదేశ్): ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో లో పొందుపరిచిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దూకుడుగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే 90 శాతం పైచిలుకు హామీలను నెరవేర్చిన జగన్ దేశంలోనే ఉత్తమ సీఎం గా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ముగించారు. ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల పేరిట ఎంతగానో లబ్ది పొందుతున్నారు. జగన్ దయవల్ల చిన్న వ్యాపారస్తులు కూడా సున్నా వడ్డీతో రుణం తెచ్చుకుంటున్నారు.

అయితే జగన్ పాలన పట్ల నిరుద్యోగుల మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగులు జగన్ పై తమకున్న అసంతృప్తిని ఓటు వేయకుండా వ్యక్తపరుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఎన్నికలకు ముందు జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
దీనితో జగన్ అధికారంలోకి వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని భావించిన నిరుద్యోగులు అందరూ కూడా వైసీపీ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంత వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయలేదని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తమ ఆగ్రహాన్ని పంచాయతీ ఎన్నికల ద్వారా వెళ్ళగక్కడానికి నిరుద్యోగులందరూ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ టాక్ ప్రకారం నిరుద్యోగులు జగన్ సర్కార్ కి షాక్ ఇవ్వనున్నారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.