CM Jagan : ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు.! తెలంగాణకు కేంద్రం అల్టిమేటం.!

NQ Staff - August 29, 2022 / 10:23 PM IST

CM Jagan : ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు.! తెలంగాణకు కేంద్రం అల్టిమేటం.!

CM Jagan : ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణకు విద్యుత్తుని అమ్మడం జరిగింది. అయితే, 2014 నుంచి 2017 మధ్య తెలంగాణకు ఏపీ అందించిన విద్యుత్తుకి సంబంధించి బకాయిల్ని తెలంగాణ ఇప్పటిదాకా చెల్లించలేదన్నది అసలు వివాదం.

AP CM Jagan complaint to PM Modi

AP CM Jagan complaint to PM Modi

పదే పదే తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల బకాయిల కోసం మొరపెట్టుకుంటూనే వుంది. అయినాగానీ, తెలంగాణ ప్రభుత్వం స్పందించడంలేదన్ని ఏపీ ప్రభుత్వ వాదన. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసినప్పుడు ఈ బకాయిల అంశం ప్రస్తావనకు వచ్చిందట.

వైసీపీ నేత హర్ష వర్ధన్ రెడ్డి సంచలనాత్మక ట్వీట్..

వైసీపీ నేత, స్టేట్ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా సంచలనాత్మక ట్వీటు వేశారు. ఆ ట్వీటు సారాంశమేంటంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశాక, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించిందని.

30 రోజుల్లోగా ఏపీకి వడ్డీతో సహా మొత్తం బకాయిల్ని చెల్లించాల్సిందిగా కేంద్రం, తెలంగాణకు రాసిన లేఖని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో హర్ష వర్ధన్ రెడ్డి పోస్ట్ చేశారు. దాంతో, ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు ఒకింత గుస్సా అవుతున్నారు.

బకాయిల విషయానికొస్తే, ప్రిన్సిపల్ అమౌంట్ 3441.78 కోట్లకు అదనంగా సర్‌ఛార్జి 3315.14 కోట్లు కలిపి చెల్లించాలన్నది కేంద్రం తాలూకు ఆదేశంగా కనిపిస్తోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us