మొదటి రోజు అసెంబ్లీ చూసి ఏపీ మొత్తం షాక్ అయ్యింది – సూపర్ సీన్ జరిగింది !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు మొదలవనున్నాయి. శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు బీఏసీ మీటింగ్ మొదలవుతుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజులు సెషన్స్ కొనసాగించాలి, ప్రభుత్వం తరపున ప్రవేశబెట్టబోయే బిల్లులు వంటి అంశాల గురించి ప్రభుత్వం మరియు ప్రతి పక్షం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

jagan
CM YS Jagan

వైస్ జగన్ కీలక బిల్లులు

ఇక వైసీపీ ప్రభుత్వం ఈ సమావేశాల్లో ముఖ్యమైన బిల్లులను ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కీలకమైన బిల్లు వలన రాష్ట్ర యువతను ఒక దారిలోకి తీసుకచ్చే ప్రయత్నం చేస్తుందట ప్రభుత్వం. ముఖ్యంగా డ్రగ్స్ అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌, ఎర్రచందనం స్మగ్లింగ్‌ వంటి విషయాలపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.. ఇసుక, మద్యం అక్రమ రవాణా ఆపడానికి ఏర్పాటు చేరిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్మెంట్ పరిధిలోకి ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి పలు విషయాలను జోడిస్తూ దానికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకరావాలని వైస్ జగన్ భావిస్తున్నారట. ఇక మరో వైపు ప్రతిపక్ష నాయకులు మాత్రం వైస్ జగన్ ప్రభుత్వం లో జరుగుతున్న అవకతవకలను ఎండగట్టే పనిలో ఉన్నారట. ఇందుకు సంబంధించి టీడీపీ నాయకులూ ప్రణాళికలు కూడా రచిస్తున్నారట. సోమవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి బాబు మరియు టీడీపీ ముఖ్య నేతలు నివాళులు ఇవ్వబోతున్నారు.

నివాళులు అర్పించిన పిమ్మట అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు. ఈ అసెంబ్లీ సెషన్స్ లో ముఖ్యమైన 20 అంశాలపై హౌస్ లో చర్చ జరపాలని బాబు పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఉపాధి హామీ బకాయిలు, ఇళ్ల పట్టాల పంపిణి, టిడ్కో ఇళ్ల పంపిణీ, పోలవరం ప్రాజెక్టు, ఇసుక పాలసీ, స్థానిక ఎన్నికలు, దేవాలయాల భూముల వేలం వంటి పలు అంశాలపై టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా సమావేశాల్లో బాబు అండ్ కో చర్చకు తేవాలని భావిస్తున్నారట. అలాగే సభను నామమాత్రంగా కాకుండా కనీసం 10 రోజులైనా నిర్వహించేలా ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలనీ టీడీపీ ప్రయతిస్తుంది. మరి ఇన్నాళ్లు హైదరాబాద్ లో తల దాచుకున్న బాబు ఇప్పుడు ఉన్న ఫలంగా జగన్ ప్రభుత్వం పై పోరాడాలననుకోవడం చూసి ఏపీ మొత్తం షాక్ అవుతుంది.

Advertisement