టీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీ గూటికి మరో సీనియర్ నాయకుడు ?
Admin - November 12, 2020 / 12:49 PM IST

టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉపఎన్నికతో కాస్త ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పాలి. అయితే కొద్దీ పాటి ఓట్ల తేడాతో అక్కడ టీఆర్ఎస్ ఓటమి చెందింది. దీనితో టీఆర్ఎస్ శ్రేణులకు కాస్త నిరాశే ఎదురయ్యింది. ఇక ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల కోసం సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటె టీఆర్ఎస్ లో ఉన్న పలువురు కీలక నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీజేపీ లో చేరుతున్నారని జోరుగా వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఇదే నేపథ్యంలో మరొక కీలక నాయకుడు కూడా బీజేపీలోకి చేరాలని ఆలోచనలో ఉన్నారట.

kcr ktr the news qube
అయితే మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడని ఆయన సన్నిహితుల్లో టాక్ వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులనుండి టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నాడు కడియం. టీఆర్ఎస్ పార్టీ లో సరైన ప్రాధాన్యత లేకపోయే సరికి కాస్త నిరాశగా ఉన్నాడు. అంతేకాదు తన రాజకీయా భవిష్యత్ కోసం పలు సార్లు సీఎం కెసిఆర్ తో కూడా రహస్య మంతనాలు జరిపారు. వచ్చే ఎన్నికలో తన కూతురికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి టికెట్ ఇవ్వాలని కూడా కోరాడట కడియం శ్రీహరి. ఇక ఈ విషయం ఇలా ఉంటె వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి ఎమ్మెల్సీ టికెట్ ను మరల పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది.
కానీ కడియం ఈ టికెట్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఒకవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఉన్నప్పటికీ మళ్ళి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనున్నారని వస్తున్న వార్తలపై కడియం వర్గాలు కాస్త గుర్రుగా ఉన్నాయట. ఇక ఒకవేళ ఎమ్మెల్సీ టికెట్ రాకపోతే కమలం గూటికి చేరాలని ఆలోచనలో ఉన్నాడట కడియం. అందుకు రహస్యంగా సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక ఒకవైపు టీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు కడియం శ్రీహరికి పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేలా వర్గపోరు నడుస్తుంది.
అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించి సాయం అందించారు కడియం శ్రీహరి. ఇక దీనితో నా నియోజకవర్గంలో నా అనుమతి లేకుండా ఎవరెవరో వచ్చి పర్యటించడం ఏంటని ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేసాడు తాటికొండ రాజయ్య. ఇక అప్పటినుండి స్టేషన్ ఘనపూర్ లో టీఆర్ఎస్ లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇక ఏది ఏమైనప్పటికి టీఆర్ఎస్ పార్టీ పై కాస్త నిరాశగా ఉన్నాడట కడియం. దీనితో బీజేపీ వైపు చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమే కాదో అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.