Ammaji Rao : ఏపీలో బీఆర్‌ఎస్ సందడి మొదలు.. ఆయన అమలాపురం ఎంపీ అభ్యర్థి?

NQ Staff - October 7, 2022 / 02:52 PM IST

Ammaji Rao : ఏపీలో బీఆర్‌ఎస్ సందడి మొదలు.. ఆయన అమలాపురం ఎంపీ అభ్యర్థి?

Ammaji Rao : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే తన టిఆర్ఎస్ పార్టీని బీఆర్‌ఎస్ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పై ఎలక్షన్ కమిషన్ తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

ఎలక్షన్ కమిషన్ బీఆర్‌ఎస్ కి అనుమతిస్తే ఇక టిఆర్ఎస్ పదం వినకుండా బీఆర్‌ఎస్ అంటూ ఆ పార్టీ నాయకులు దేశ వ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. కేసీఆర్ యొక్క ప్రధమ టార్గెట్ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర మరియు కర్ణాటక.

ఈ మూడు రాష్ట్రాల్లో సాధ్యమైనంత ఎక్కువ ఎంపీ స్థానాలను సొంతం చేసుకోవాలని కేసిఆర్ వ్యూహం గా తెలుస్తోంది. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిని తానే అంటూ రేవు అమ్మాజీ రావు ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరి కేసీఆర్‌ కి మద్దతు తెలిపాడు.

ఏపీలో ఈ పార్టీని ఎవరు పట్టించుకుంటారులే అనుకున్న వారికి మెల్ల మెల్లగా అక్కడ కేసీఆర్ పై ఉన్న అభిమానం బయటకు వస్తుండడంతో షాకింగ్ గా ఉంది. ముందు ముందు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ కి మద్దతుదారులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది.

రాబోయే ఎన్నికల్లో ఏపీ నుండి నాలుగైదు పార్లమెంటు స్థానాలను దక్కించుకుంటే కేసీఆర్ గొప్ప విజయాన్ని సాధించినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రాబట్టే ఓట్లను బట్టి బీఆర్‌ఎస్ భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us