Amit Shah : రాజమౌళితో అమిత్ షా భేటీ.. ఆ సినిమా కోసమేనా…?
NQ Staff - June 14, 2023 / 09:13 AM IST

Amit Shah : ఈ నడుమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సినీ సెలబ్రిటీలతో వరుసగా భేటీ అవుతున్నారు. మొన్న రాష్ట్రానికి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను, నితిన్ ను కలిశారు. ఇప్పుడు ఆయన మరోసారి హైదరాబాద్ రాబోతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి అమిత్ షా చేరుకోనున్నారు. రేపు ఉదయం రాజమౌళి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నివాసాలకు వెళ్లనున్నారు.
ముందుగా రాధాకృష్ణ ఇంటికి ఉదయం 11.05 వెళ్లి 11.35 వరకు గడపనున్నారు. ఆయనతో ప్రస్తుత ఏపీ రాజకీయాలు, తెలంగాణలో రాబోయే ఎన్నికల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నేరుగా డైరెక్టర్ రాజమౌళి ఇంటికి వెళ్లనున్నారు. రాజమౌళి నివాసంలో ఉదయం 11.45 గంటల నుంచి 12.15 గంటల వరకు ఉండనున్నారు.
అయితే ఎన్నడూ లేనిది రాజమౌళిని కలవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇందుకు ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. ఇప్పటికే రాజమౌళి తండ్రికి రాజ్యసభ సీటు ఇచ్చింది బీజేపీ. ఇక విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఆర్ ఎస్ ఎస్ మీద ఓ మంచి సినిమా కథను కూడా రాశారు.
అయితే ఆ కథను రాజమౌళి తెరకెక్కించాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీకి అనుబంధ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ మీద రాజమౌళి లాంటి సంచలన దర్శకుడు సినిమా తీస్తే బాగా ప్లస్అవుతుందని భావిస్తోందంట బీజేపీ. అందుకే రాజమౌళితో భేటీ అవుతున్నాడంట అమిత్ షా. ఇక ఆ తర్వాత భద్రాచలం వెళ్లి శ్రీరాముల వారిని దర్శించుకుంటారు.
సాయంత్రం 6-7 గంటల వరకు ఖమ్మం లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇక రాత్రి 7.40కి ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లి.. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు గుజరాత్ వెళ్లనున్నారు అమిత్ షా.