తిరుపతిలో గెలిచి.. యానంలో ఓడిన వైసీపీ..?

వైసీపీ పోటీచేసింది ఒక్క తిరుపతి పార్లమెంట్ లో కదా..? మరి కేంద్రపాలిత ప్రాంతం కిందకు వచ్చే యానంలో ఓడిపోవటం ఏమిటని సందేహంగా ఉందా..? అయితే మీకొక విషయం చెప్పాలి. కాకినాడ సమీపంలో ఉండే యానాం లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం ఉంది.. ఈ అసెంబ్లీ సీటు పుదుచ్చేరి లో భాగం కాబట్టి యానంలో కూడా ఎన్నికలు జరిగాయి.

Puducherry Assembly Elections 2021 | Congress government was ridden with  fault lines, leading to its fall: Rangasamy - The Hindu

తాజాగా జరిగిన పుదుచ్చేరి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్.ఆర్. కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కలిసి పోటీ చేశాయి. రంగస్వామిని మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దీనితో రంగస్వామి యానంలో పోటీకి దిగాడు. నిజానికి ఇక్కడ వరసగా గెలుస్తున్న మల్లాది కృష్ణారావు కాంగ్రెస్ కు రాజీనామా చేసి తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనితో ఇక యానంలో రంగస్వామికి తిరుగేలేదని అనుకున్నారు.

అలా బావించటానికి ప్రధాన కారణం మల్లాది కృష్ణారావు రాజీనామా చేయటం కాదు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ.. రంగస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి అతని విజయం చాలా అవసరం. పుదుచ్చేరిలో పరిస్థితులు ఎలాపోయి ఎలా వస్తాయో అని కంగారు పడిన బీజేపీ జగన్ తో చర్చించి వైసీపీ మద్దతు తీసుకోని రంగస్వామిని యానంలో పోటీకి దించిదని, అందులో భాగంగానే జగన్ ను అభిమానించే మల్లాది కృష్ణరావు యానాం ఎన్నికల్లో పోటీచేయకుండా తప్పుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

புதுச்சேரி: ஏனாம் தொகுதியில் ரங்கசாமி தோல்வி! 28 வயது சுயேட்சை வேட்பாளர்  வெற்றி | Puducherry Yanam Assembly Constituency tough fight between NR  Congress President N Rangasamy and ...

ఇదే సమయంలో కాకినాడ సమీపంలోని వైసీపీ నేతలు కూడా యానంలో మకాం పెట్టి రంగస్వామి గెలుపుకు సహాయం చేశారనే మాటలు కూడా వినిపించాయి. తీరా ఇప్పుడు ఫలితాలు చూస్తే రంగస్వామి మీద ఒక ఇండిపెంటెడ్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ విజయం సాధించి భారీ షాక్ ఇచ్చాడు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి అభ్యర్థి పైగా వైసీపీ పార్టీ మద్దతు ఉంది. బలమైన మల్లాది కృష్ణారావు తప్పుకొని తెరవెనుక మద్దతు ఇచ్చిన కానీ రంగస్వామి ఓడిపోవటం ఒక రకంగా వైసీపీకే మచ్చ అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇవన్నీ తెరవెనుక జరిగే వ్యవహారాలు కాబట్టి యానాంలో ఓటమి వలన వైసీపీకి రాజకీయంగా వచ్చే ఇబ్బందులు కూడా లేనట్లే అని చెప్పాలి .

Advertisement