జగనన్న శ్మశానాలు…? దారుణమైన కామెంట్స్ చేసింది ఎవరంటే..?

మృతదేహాలను కాల్చడానికి శ్మశానాల్లో ఖాళీలేని దౌర్భాగ్యపు స్థితిలో రాష్ట్రముండటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఈ ముఖ్యమంత్రి “జగనన్న శ్మశానాల”పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తాడేమో? ఈ మాటలు అంది ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి, దీనిని ఉద్దేశించి గోరంట్ల అటు జగన్ మీద ఇటు మోడీ మీద సంచలనం వ్యాఖ్యలు చేశాడు ..

Telugu News| Latest Telugu News Live | Andhra News| Prime9 News

ముందుగా జగన్ మీద గోరంట్ల కామెంట్స్ అతని మాటల్లో

★ రాష్ట్రంలో భారీగాకేసులు పెరగడంతో చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లు నింపాదిగా తరువాత జగన్ ప్రభుత్వం కోవిడ్ కేంద్రాలను ప్రారంభించిందన్నారు.

★ నేడు రెండోదశ కరోనా వ్యాప్తిలో ప్రభుత్వం పూర్తిగా వైరస్ నిర్థారణ పరీక్షలను ఎందుకు నిలిపివేసింది.

★ కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం ఏంచేసిందన్న ఆయన, ఎక్కడా వ్యాక్సిన్లు అందు బాటులో లేకుండా పోయాయి.

★ తొలిదశ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి రెండోసారి వేయడానికి ఎక్కడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది.

★ ప్రభుత్వకార్యక్రమాల పేరుతో పత్రికా ప్రకటనలకు, వేలకోట్లు ఖర్చుచేస్తున్న జగన్మో హన్ రెడ్డి, వ్యాక్సిన్ కొనడానికి డబ్బులేదనడం సిగ్గుచేటు.

★ రోజూ శ్మశానాల్లో తగలేస్తున్న శవాల లెక్కలు తీస్తే, జగన్మోహన్ రెడ్డి తలెత్తు కునే పరిస్థితులు ఉండవు.

★ కక్షసాధింపులు, ప్రతిపక్షాన్ని అణచివేసే చర్యలు, ఒకవర్గాన్ని అణచి వేయడం వంటిచర్యలతో ముఖ్యమంత్రికి ఏమీ ఒరిగాదు.

★ చరిత్రలో ఆయనకూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం

★ ఆఖరికి శ్మశానాల్లో దహనాలకు ఖాళీలేదని, జగనన్న శ్మశానాల పేరుతో వాటిని కూడా ఏర్పాటు చేయాలని బుచ్చయ్య దెప్పిపొడిచారు.

Seer advised Naidu on ghat: TD MLA Gorantla Buchaiah Chowdary

మోడీపై గోరంట్ల

మోదీ, తన అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచం ముందు దేశాన్ని నవ్వులపాలు చేశాడు.

– కరోనా విశృంఖలంగా ప్రబలుతుండటంతో దేశమంతా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడింది.

– యువకుడు, దేశాన్ని బాగుచేస్తాడని నమ్మి ప్రజలు మోదీని గెలిపిస్తే, నేడు భారత్ ను ప్రపంచమంతా బాయ్ కాట్ చేసే పరిస్థితిని కల్పించాడు.

– ప్రపంచానికి భారతదేశమే ఔషధం అందిస్తోందని నిన్నటివరకు చంకలు గుద్దుకున్నాడు.

– కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల తయారీతో దేశం కరోనాను జయించిందని ప్రగల్భాలు పలికాడు.

– మత, ఎన్నికల ప్రచారాలకు ప్రాధాన్యమిచ్చి, ప్రజల ప్రాణాలు పోయేదాకా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

– తన అనాలోచిత చర్యలతో ప్రపంచం ముందు దేశాన్ని నవ్వుల పాలు చేశాడు.

– ప్రధాని హోదాలో కుత్సిత, కుట్రరాజకీయాలకు పాల్పడకుండా, దేశం గురించి మోదీ ఆలోచిస్తే మంచిది.

– అతని కంటే ఘనుడు ఆచంటమల్లన్న అన్నట్లు మోదీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి నిర్వాకాలతో రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయి.

 

Advertisement