Defense Ministry Control Center : కరుణించిన ర‌ష్యా.. భార‌తీయుల‌ని త‌ర‌లించేందుకు 130 బ‌స్సులు సిద్దం చేసిన ర‌క్ష‌ణ శాఖ‌

NQ Staff - March 4, 2022 / 08:39 PM IST

Defense Ministry Control Center : కరుణించిన ర‌ష్యా.. భార‌తీయుల‌ని త‌ర‌లించేందుకు 130 బ‌స్సులు సిద్దం చేసిన ర‌క్ష‌ణ శాఖ‌

Defense Ministry Control Center : ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండయాత్ర వ‌ల‌న ఎంతో మంది భార‌తీయులు ఆందోళ‌నలో ఉన్నారు. అయితే భార‌తీయ‌ల తరలింపు విషయంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్స్‌ను స్వదేశానికి షిఫ్ట్‌ చేసేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. ఇండియన్స్‌ని ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది.

ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ ప‌ట్ట‌ణాన్ని ర‌ష్యా చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ న‌గ‌రంలో వేలాది మంది భార‌తీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇత‌ర దేశస్థులు కూడా ఉన్నారు. ఖార్కీవ్‌, సుమే ప్రాంతంలో ఉన్న భార‌తీయ విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు 130 బ‌స్సులు సిద్ధంగా ఉన్న‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణశాఖ కంట్రోల్ సెంట‌ర్‌ తెలిపింది.

The Russian Defense Ministry Control Center said 130 buses were ready to pick up Indian students.

The Russian Defense Ministry Control Center said 130 buses were ready to pick up Indian students.

ఆ విద్యార్థుల‌ను ర‌ష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతానికి త‌ర‌లించ‌నున్నట్లు క‌ల్న‌ల్ జ‌న‌ర‌ల్ మిఖేయిల్ మిజిన్‌సేవ్ తెలిపారు. ఖార్కీవ్‌లోని రైల్వే స్టేష‌న్‌లో పెద్ద సంఖ్య‌లో భార‌తీయ విద్యార్థులు బంధీ అయి ఉన్న‌ట్లు నిన్న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ చెప్పిన విష‌యం తెలిసిందే. ఫైరింగ్ వ‌ల్ల ఖార్కీవ్ నుంచి విద్యార్థుల త‌ర‌లింపు ఆగిన‌ట్లు ఇండియా పేర్కొన్న త‌ర్వాత పుతిన్ నిన్న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

గురువారం ర‌ష్యా సెక్యూర్టీ కౌన్సిల్‌లో మాట్లాడిన పుతిన్‌.. 3179 మంది భార‌తీయుల్ని బంధీలుగా చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఖార్కీవ్‌లో విద్యార్ధులు చిక్కుకున్న విష‌యంపై పుతిన్‌తో బుధ‌వారం ప్ర‌ధాని మోదీ ఫోన్‌లో మాట్లాడిన విష‌యం తెలిసిందే. రష్యా నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ అధినేత కల్నల్ జనరల్ మైఖాయిల్ మిజింట్స్‌వ్ బస్సుల ఏర్పాట్లపై ప్రకటించారు.

The Russian Defense Ministry Control Center said 130 buses were ready to pick up Indian students.

The Russian Defense Ministry Control Center said 130 buses were ready to pick up Indian students.

గురువారం ఉదయం 6 గంటల నుంచి బెల్గొరాడ్ రీజియన్ లోని నెఖొటెయెవ్‌కా, సుధ్జా చెక్‌పోస్టుల నుంచి ఖర్కోవ్, సుమీ లకు వెళ్లడానికి 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఈ స్థలాల్లో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేయడమైందని, మిగిలినవి చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేయడమైందని తెలిపారు. శరణార్థులకు భోజనం, ఔషధాల నిల్వలతో మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటైనట్టు తెలిపారు. బెల్గొరాడ్ వరకు బస్సులపై వెళ్లినవారు అక్కడ నుంచి స్వదేశాలకు రష్యా మిలిటరీ విమానాలతో సహా విమానాల ద్వారా వెళ్లవచ్చని తెలిపారు.

Read Today's Latest Political Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us