Connect with us

Latest News

మోడీని ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Published

on

PM Modi-WHO
Share the News from here

కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా ప్రపంచంలో పెరుగుతూనే ఉంది. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారత్ ను కొనియాడింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారత్‌, ప్రపంచదేశాలకు సహాయపడుతుందని మోదీ ఇచ్చిన హామీపై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ స్పందించారు. కరోనా పోరులోభాగంగా మీ నిబద్ధతకు ధన్యవాదాలు. ప్రపంచ శ్రేయస్సుకోసం మన దగ్గరున్న శక్తులను, వనరులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే ఈ మహమ్మారికి ముగింపు పలకగలం’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు.

ఇప్పటికే భారత ఔషధ సంస్థలు 150 దేశాలకు అత్యవసర మందులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయి. కరోనాను ఎదుర్కొనడంలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఇప్పటికే అనేకమంది ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.

Do NOT follow this link or you will be banned from the site!