Prabhas : పిక్ ఆఫ్ ది డే.. ఒకే ఫ్రేములో ప్ర‌భాస్, అమితాబ్, ప్ర‌శాంత్ నీల్, రాఘ‌వేంద్ర‌రావు

NQ Staff - June 27, 2022 / 12:26 PM IST

Prabhas : పిక్ ఆఫ్ ది డే.. ఒకే ఫ్రేములో ప్ర‌భాస్, అమితాబ్, ప్ర‌శాంత్ నీల్, రాఘ‌వేంద్ర‌రావు

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమా త‌ర్వాత క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన రాధేశ్యామ్ ఫ్లాప్ అవ‌డంతో ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి సినిమాల‌పై ఫుల్ ఫోక‌స్‌ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈయ‌న ఓ భారీ హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి.

New Photos Prabhas with Star

New Photos Prabhas with Star

క్రేజీ పిక్..

అందులో ‘ప్రాజెక్ట్‌-K’ ఒక‌టి. మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బిగ్ బీ అమితాబ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం తాజాగా హైద‌రాబాద్ షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది. ఫాంటసీ సైంటిఫిక్ నేప‌థ్యంలో చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే ఈ రోజు ఉదయం, ఈ సినిమాకి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా అవుతుంది. ఫోటోలో నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాని మరియు దుల్కర్ సల్మాన్‌లతో పాటు ప్రభాస్ కూడా ఉన్నాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా వీరంతా ఈ పిక్ తీసుకున్నారు.

New Photos Prabhas with Star

New Photos Prabhas with Star

ఈ ఫోటోలో ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. తన సలార్ కోసం ప్రభాస్ కొంత బరువు తగ్గిన సంగతి తెలిసిందే. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాన్ని కూడా అంతకు మించిన స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని వైజ‌యంతీ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల మందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్ర‌భాస్ న‌టించిన ‘ఆదిపురుష్’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ‘స‌లార్’ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. వీటీతో పాటు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ‘స్పిరిట్’ చిత్రం తెర‌కెక్క‌నుంది.

Read Today's Latest పిక్ టాక్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us