Lavanya Tripathi: ఎద అందాల‌కు అడ్డుగా క‌ర్చీఫ్‌.. లావ‌ణ్య ఫోజుల‌కి కుర్ర‌కారు ఫిదా!

Lavanya Tripathi: ఆక‌ర్షించే అందం, కైపెక్కించే క‌ళ్ల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ బ్యూటీ . నాని సరసన మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ అనే సినిమా చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది.

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రంలో నాగ్ స‌ర‌స‌న న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది.కెరీర్ మొద‌ట్లో మంచి హిట్స్ అందుకున్న ఈ అమ్మ‌డి జోరు ఇప్పుడు కాస్త తగ్గిందని అనిపిస్తుంది, ఈ మధ్యకాలంలో లావణ్య నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

చివ‌రిగా వ‌చ్చిన చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమాతో కూడా ఈ అమ్మ‌డు పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చావు కబురు చల్లగా సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయని టాక్ వినిపిస్తుంది. మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తుంది.

అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే లావ‌ణ్య త్రిపాఠి అప్పుడ‌ప్పుడు అందాల ఆర‌బోత‌తోన నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా ఎద అందాల‌కు క‌ర్చీఫ్ లాంటి క్లాత్ అడ్డు పెట్టుకొని కైపెక్కించే చూపులు చూస్తుంది ఈ సొట్ట బుగ్గ‌ల సుంద‌రి. లావ‌ణ్య అందాల‌ను చూసి కుర్ర‌కారు ఫిదా కాకుండా ఉండ‌లేక‌పోతున్నారు.