Anu Emmanuel: అను బేబి.. ఈ అందాల ఆర‌బోత ఏంది?

Tech Sai Chandu - September 2, 2021 / 09:31 PM IST

Anu Emmanuel: అను బేబి.. ఈ అందాల ఆర‌బోత ఏంది?

Anu Emmanuel: కొంద‌రు అందాల భామ‌లు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నారు. అందం, మంచి టాలెంట్ ఉన్నా కూడా ఎక్కువ కాలం ఇండ‌స్ట్రీలో ఉండ‌లేక‌పోతున్నారు. దీంతో గ్లామ‌ర్ షోతో మ‌త్తెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌.. తెలుగు ప్రేక్షకుల‌కు బాగానే సుప‌రిచితం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి చిత్రంలో మెరిసిన ఈ అమ్మ‌డు అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది.

‘యాక్షన్‌ హీరో బైజు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అను ఎమ్మాన్యుయేల్ తెలుగులోనాని స‌ర‌స‌న మ‌జ్ను అనే చిత్రం చేసింది. అనంత‌రం చైతూ న‌టించిన శైల‌జా రెడ్డి అల్లుడు మూవీలో క‌థానాయిక‌గా న‌టించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన ‘అల్లుడు అదుర్స్ చిత్రంలోను మెరిసింది.ఈ అమ్మ‌డికి ఏ సినిమా కూడా పెద్ద‌గా బ్రేక్ ఇవ్వ‌లేదు.

ప్ర‌స్తుతం అల్లు శిరీష్‌తో క‌లిసి ప్రేమ కాదంట అనే సినిమా చేస్తుంది. ఇందులో ఇద్ద‌రు చాలా రొమాంటిక్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ మూవీపై అనుకి చాలా అంచ‌నాలే ఉన్నాయి,

అయితే సినిమాలు త‌న‌కు పెద్ద‌గా వ‌ర్కవుట్ కావ‌ట్లేద‌ని భావించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల అందాల ఆర‌బోస్తూ యూత్‌కి మాంచి కిక్ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు ఎద అందాలు ఆర‌బోస్తూ యూత్‌కి మాంచి కిక్ ఇస్తుంది. అనుని ఇలా చూసిన నెటిజ‌న్స్ ఏంది బేబి ఈ ర‌చ్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆ మ‌ధ్య అను ఎమ్మాన్యుయేల్ .. ఆక్సీజ‌న్ సినిమా ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ‌తో డేటింగ్‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Read Today's Latest పిక్ టాక్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us