Connect with us

Entertainment

ధోని రికార్డ్ ను బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు

Published

on

Share the News from here

సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ యొక్క అభిమానుల మధ్య డిజిటల్ రికార్డ్ కోసం ఎప్పుడు ఫ్రెండ్లీ వార్స్ జరుగుతుంటాయి. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు అభిమానులు క్రియేట్ చేసిన రికార్డును పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోకు సంబంధించిన సీడీపీతో బ్రేక్ చేశారు. కేవలం 24 గంటల్లో 64మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డ్ ను సృష్టించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన సంబంధించిన వీడియోస్, ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. కానీ పవన్ అభిమానులు ధోని రికార్డ్ ను కూడా బ్రేక్ చేశారు.

ఒకప్పుడు అభిమానులు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను బ్రేక్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తమ ప్రతాపాన్ని చూపిస్తూ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. హీరోలు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గర ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా హీరోలు తమ అభిమానులను సామాజిక సేవ వైపు నడిపిస్తున్నారు. సోషల్ మీడియా అనేది హీరోస్ కు అభిమానులకు మధ్య వారధిలా పని చేస్తుంది.

Do NOT follow this link or you will be banned from the site!