Zerodha : వావ్.! వాట్ ఏ క్రేజీ ఆఫర్.! బరువు తగ్గితే, 10 లక్షలు.!

NQ Staff - September 26, 2022 / 08:19 AM IST

Zerodha : వావ్.! వాట్ ఏ క్రేజీ ఆఫర్.! బరువు తగ్గితే, 10 లక్షలు.!

Zerodha : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.!ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఓ క్రేజీ ఛాలెంజ్ విసిరింది. బరువు తగ్గితే 10 లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానే ఆయా కంపెనీల ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై బొత్తిగా దృష్టి పెట్టడం మానేశారు ఉద్యోగులంతా.తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ కంపెనీ ఈ క్రేజీ ఆఫర్ పెట్టింది. ఇంతకీ ఏంటా కంపెనీ.? ఏమా కథ.? అనుకుంటున్నారా.?ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధ. ఆ కంపెనీ సీఈవో అయిన నితిన్ కామత్ ఈ క్రేజీ ఆఫర్ పెట్టారు. తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనూ ఆరోగ్యంగా వుండాలనే వుద్దేశ్యంతోనే ఈ తరహా ఛాలెంజ్ పెట్టినట్లు ఆయన వివరించారు. ఇలా చేయడం ద్వారా తమ ఉద్యోగులు మరింత యాక్టివ్‌గా వుంటారనీ ఆయన తెలిపారు.

ఆఫర్ సూపర్..ఇందుకోసం కంపెనీ ఫిట్‌నెస్ ట్రాకర్‌ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ 350 క్యాలరీలు ఖర్చు చేయాలనేది ఆ ఛాలెంజ్ షరతుగా ప్రకటించారు. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌పై ప్రతిరోజూ గోల్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా కల్పించారు.పెట్టుకున్న గోల్స్‌లో 90 శాతం సాధిస్తే, వారికి వచ్చే ఏఢాది ఒక నెల జీతం బోనస్‌గా ఇస్తారట.

అలాగే లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి, వారికి 10 లక్షల రూపాయలు బంపర్ ఆఫర్ ఇస్తామని తెలిపారు. వావ్.! వాట్ ఏ ఆఫర్ కదా. నిజంగానే ఈ ఛాలెంజ్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకుని సదరు కంపెనీ ఉద్యోగులు ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌ని ఫాలో చేస్తారు కదా.ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట. ఓ వైపు శాలరీ బోనస్. మరోవైపు హెల్త్ ఫోకస్ అన్నట్లు. అదిరిందయ్యా బాస్.!

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us