చేప మరణించిందని దేశ అధ్యక్షుడి సంతాపం

Advertisement

సాధారణంగా ఎవరైనా ప్రముఖులు లేదా ప్రజలు మరణిస్తే రాజకీయ నాయకులు, దేశ అధ్యక్షులు సంతాపం తెలుపుతారు. ఇక ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఒక ప్రాంతాన వింత సంఘటన జరిగింది. అది ఏంటంటే చేప చనిపోయిందని సంతాపం తెలిపాడు ఓ దేశ అధ్యక్షుడు. వివరాల్లోకి వెళితే జాంబియా దేశ అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ ఓ చేప మరణించిందని సంతాపం తెలిపారు. అయితే జాంబియాలోని కాపర్బెల్ట్ విశ్వవిద్యాలయంలో ‘మాఫిషి’ అనే చేప ఉంది. విద్యార్థులు పరీక్షలకు హజరయ్యేముందు చేపకు ప్రార్థనలు చేసేవారు.

ఆ చేప తమకు అదృష్టం తెచ్చిపెడుతుందని వారు నమ్ముతారు. అలాగే ఆ చేప ను చూస్తే ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు తెలిపారు. అలాగే ఈ చేప ఈత కొడుతున్నపుడు చూస్తే వత్తిడి తగ్గి పరీక్ష సమయంలో పరీక్ష ప్రశాంతంగా రాయొచ్చు అని వారి నమ్మకం. అయితే యూనివర్సిటీ చెరువులో ఈ చేప 20 సంవత్సరాల నుంచి ఉంటోంది. ఇక మరణించిన చేప ను కెమికల్స్ పూసి కుళ్లిపోకుండా ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారి కసోండే వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here