ధోని రిటైర్మెంట్ కు కరోనా కూడా ఒక కారణమే : చాహల్

Advertisement

అంతర్జాతీయ క్రికెట్ నుండి తాను తప్పుకుంటున్నట్లు ఇండియన్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నాడు. ఇక క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ధోని రిటైర్మెంట్ పై ఇప్పటికి ఎంతోమంది అభిమానులు నిరాశ తోనే ఉన్న విషయం తెలిసిందే. అలాగే ధోని రిటైర్మెంట్ పై ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు స్పందిస్తూ ధోని భారత క్రికెట్ లో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తాజాగా ధోని రిటైర్మెంట్ పై భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడానికి కరోనా వైరస్ కూడా ఒక కారణం అంటూ చాహల్ కామెంట్ చేశాడు. ధోనీ రిటైర్మెంట్ తనను షాక్‌కు గురిచేసిందని అన్నాడు. కనీసం 2020 ప్రపంచ కప్‌ వరకూ కొనసాగుతాడని భావించానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే సత్తా ధోనీకి ఇప్పటికీ ఉందని చెప్పుకొచ్చాడు. ధోని లాంటి వికెట్ కీపర్ జట్టుకు మళ్ళీ లభించడం కష్టమని చాహల్ తెలిపాడు. అలాగే నేను, కుల్దీప్ యాదవ్ క్రికెట్‌లో నిలదొక్కుకోవడానికి ధోనీనే కారణమని అన్నాడు. ధోని నుండి తాము ఎంతో నేర్చుకున్నామని పేర్కొన్నాడు. పిచ్ విషయంలో ఎలా ఉందో ధోనీ ముందుగానే అంచనా వేయగలడని, వికెట్ల వెనుక ధోనీ ఉంటే నా బౌలింగ్ సులువు అవుతుందని చాహల్ వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here