క్రికెట్‌లోకి మ‌ళ్లీ అడుగుపెడుతున్న యువ‌రాజ్.. ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

Samsthi 2210 - December 15, 2020 / 01:41 PM IST

క్రికెట్‌లోకి మ‌ళ్లీ అడుగుపెడుతున్న యువ‌రాజ్.. ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధుల గుండెల్లో ద‌డ‌పుట్టించే యువీ టీం క్రికెట్‌లో ఆరు సిక‌ర్స్ కొట్టిన తొలి క్రికెట‌ర్‌గా నిలిచాడు. 2015 వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ సొంతం కావ‌డంతో యువ‌రాజ్ పాత్ర చాలా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో అద‌ర‌గొట్టిన ఆయ‌న మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపిక కాబ‌డ్డాడు. అయితే కొద్ది రోజుల త‌ర్వాత యువ‌రాజ్ స‌రిగ్గా స‌త్తా చూప‌ని కార‌ణంగా అత‌ను భార‌త్ టీంకు పెద్ద భారంగా మారాడు.

yuvraj

ఇప్పుడ యువ‌రాజ్ సింగ్ మ‌ళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ప్ర‌క‌టించిన 30 మంది ప్రాబ‌బుల్స్ జాబితాలో యువ‌రాజ్ సింగ్ పేరు ఉండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే మొహాలీలోని ఐఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో యువీ నెట్ ప్రాక్టీస్ మొద‌లు పెట్టగా, అతను మ‌ళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్ట‌డం ఖాయం అని అంటున్నారు. ఈ నెల 18 నుంచి పంజాబ్ ప్లేయ‌ర్స్ కోసం లుధియానాలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లోనూ యువీ పాల్గొన‌నున్నాడు.

గ‌త ఏడాది యువ‌రాజ్ ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ నుండి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రిటైర్‌మెంట్ త‌ర్వాత కెన‌డాలో జ‌రిగిన గ్లోబ‌ల్ టీ20 లీగ్ స‌హా ప‌లు విదేశీ లీగ్స్‌లో ఆడుతున్నాడు. ఇప్పుడు పంజాబ్ లీగ్ మ్యాచ్‌ల‌లోను ఆడేందుకు యువీ సిద్ద‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తుండగా, ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ సంతోష‌ప‌డుతున్నారు

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us