YSRCP Victory in Panchayat Elections : చంద్రబాబు, బాలయ్య ఇలాకాలో వైసీపీ సునామీ.. టీడీపీ పరువు పాయే..!
NQ Staff - August 20, 2023 / 02:14 PM IST

YSRCP Victory in Panchayat Elections : వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం.. జగన్ ఓడిపోతాడు.. వైసీపీ ప్రభుత్వ అవినీతితో ప్రజలు విసిగిపోయారు.. నాలుగున్నరేళ్లలో జగన్ పాలనపై వ్యతిరేకత పెరిగింది.. బైబై వైసీపీ లాంటి స్లోగన్ లు ఇచ్చారు ఇన్ని రోజులు చంద్రబాబు, పవన్ కల్యాణ్. పాపం వాళ్లంతా ఇన్నాళ్లు ఊహల్లోనే బతికేసారు. ఏదో జరిగిపోతుందని.. వైసీపీపై ప్రజల్లో అభిమానం తగ్గిందని అనుకున్నారు. పైగా చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి వైనాట్ పులివెందుల అని కూడా అనేశాడు. అక్కడికేదో వచ్చే ఎన్నికల్లో ఏపీ మొత్తం ఆయన పార్టీనే గెలుస్తున్నట్టు చెప్పాడు. కానీ తాజాగా విడుదలైన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు కొట్టుకుపోయాడు.
ఏపీలో 66 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగితే అందులో ఏకగ్రీవాలతో కలిపి ఏకంగా 53 స్థానాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే గెలించింది. జనసేన అయితే మరీ దారుణంగా కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది. 1062 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిసి 810 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీ కేవలం 182 స్థానాల్లో, జనసేన ఏడు చోట్ల గెలిచాయి. వైసీపీకి కనీసం దరిదాపుల్లో కూడీ ఈ పార్టీలు లేవు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే.. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ సునామీ సృష్టించింది.
కుప్పంలో ఆరు వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆరింటిలో ఏకంగా ఐదు స్థానాల్లో వైసీపీ మద్దతు దారులు గెలిచారు. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ గెలిచింది. చంద్రబాబు ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్న శాంతిపురం మండలం, శివపురం వార్డ్ కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది. ఇక ఆయన బావమరిది, బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో సైతం చలివెందుల పంచాయతీ సర్పంచ్ స్థానం వైసీపీ గెలచుకుంది. దీంతో సొంత ఇలాకాల్లో కూడా చంద్రబాబు, బాలయ్య బాబు తమ మద్దతు దారులను గెలిపించుకోలేక చతికిల పడ్డారు. ముందు రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న టీడీపీ, జనసేనకు ఈ ఎన్నికలు కళ్లు తెరిపించాయి.
ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ మీద తీవ్రమన వ్యతిరేకత పెరిగిందని పాదయాత్రలో లోకేష్, వారాహి యాత్రలో పవన్ కల్యాన్, బస్సు యాత్రలో చంద్రబాబు పదే పదే ప్రచారం చేశారు. కానీ ప్రజల్లో జగన్ మీద అభిమానం, వైసీపీ మీద నమ్మకం ఇంచు కూడా చెదరలేదని మరోసారి నిరూపితం అయింది. వైసీపీ ఈ స్థాయిలో గెలవడానికి కారణం జగన్ చేపడుతున్న సంక్షేమమే. ఆ జిల్లా ఈ జిల్లా ఆ ప్రాంతం అని లేకుండా రాష్ట్రం నలువైపులా జగన్ పథకాలు అందుతున్నాయి.
ప్రతి ఇల్లు ఏదో ఒక రకంగా జగన్ సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతోంది. అందుకే ప్రజలే బల్ల గుద్ది మరీ జగన్ కే ఓటేస్తున్నారు. రాబోయే ఎన్నికలు ఇవి శాంపిల్ గా భావించొచ్చు. ఎందుకంటే ఎన్నికలు ఇంకెంతో దూరంలో లేవు. అంటే జగన్ మీద ఈ నాలుగున్నరేళ్లలో నమ్మకం పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు.