YSRCP : లండన్ లో ఘనంగా వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..!

NQ Staff - October 16, 2023 / 09:23 AM IST

YSRCP : లండన్ లో ఘనంగా వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..!

YSRCP :

వైసీపీకి సోషల్ మీడియా వింగ్ ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ పార్టీకి అతిపెద్ద బలంగా ఉంది సోషల్ మీడియా వింగ్. అయితే తాజాగా లండన్ లో వైపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, పార్టీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్ గా వైసీపీ రాష్ట్ర మీడియా మరియు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, అలాగే APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్, APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, వైసీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి లండన్ లో ఉన్న 450 మందికి కార్యకర్తలు హాజరయ్యారు.

YSRCP Social Media Meeting In London

YSRCP Social Media Meeting In London

ఈ సందర్భంగా భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్ కష్టపడుతున్నారని.. కాబట్టి ఆయన కోసం మనమంతా కష్టపడాలని తెలిపారు. ఇప్పటికే అవినీతి పరులను జగన్ పరుగులు పెట్టిస్తున్నారని.. ఏపీని కాపాడగలిగే సమర్థత కేవలం జగన్ కు మాత్రమే ఉందని తెలిపారు భార్గవ్ రెడ్డి.

కాబట్టి అలాంటి జగన్ కు మనమంతా అండగా ఉండాలని.. ఏపీలో గ్రామాలను సీఎం జగన్ ఎలా డెవలప్ మెంట్ చేస్తున్నారో అందరం ప్రారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న డెవలప్ మెంట్ చూసి దేశమే ఆశ్చర్యపోతోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 175సీట్లకు 175 టార్గెట్ గా అందరం కలిసి చేద్దామని, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us