Vijayasai Reddy : తారకరత్నకి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
NQ Staff - February 1, 2023 / 06:07 PM IST

Vijayasai Reddy : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా తారకరత్న గుండెపోటు రావడంతో ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఇప్పటికే తారకరత్నను పరామర్శించారు. నేడు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు.
విజయ్ సాయి రెడ్డి మరదలు కూతురు అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. వరుసకు అల్లుడు అయ్యే తారకరత్న ని బెంగళూరు వెళ్లి మరి విజయసాయిరెడ్డి పరామర్శించి వచ్చారు.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని విజయసాయిరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా లేదని ఇప్పటికే వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.