Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవమే : అంబటి
NQ Staff - December 4, 2022 / 04:08 PM IST

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ తాను ఒక ఫెయిల్యూర్ పొలిటిషన్ అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తన ఫెయిల్యూర్ నుంచి కచ్చితంగా ఎన్నో విషయాలు నేర్చుకుని సక్సెస్ అవుతాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో పేర్కొన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ మాటలపై వైకాపా నాయకులు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజమే, ఆయన రాజకీయాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ కేవలం నటుడిగా మాత్రమే విజయం సాధించారు.

YSRCP Leaders Are Reacting Differently Pawan Kalyan Words
పవన్ రాజకీయ నాయకుడిగా ఫ్లాప్ అయ్యారు.. ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోవడం మంచిది అన్నట్లుగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఒకసారి కూడా గెలవలేదు కనుక ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ అన్నట్లే అంటూ అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సరైన పాత్ర ని పోషించలేక పోతున్నారు అనేది కొందరి అభిప్రాయం.