Tidco Houses : టిడ్కో ఇళ్లపై వాస్తవాలు ఇవీ…
NQ Staff - June 15, 2023 / 09:16 AM IST

Tidco Houses : టిడ్కో గృహాల కోసం పేదలు ఎన్నో నెలలుగా వెయిట్ చేస్తున్నారు. చిన్న కుటుంబాలు నివసించేందుకు అనువుగా డిజైన్ చేయబడిన ఈ ఫ్లాట్స్ వస్తే ఎంతో మంది తమ పిల్లా పాపలతో అక్కడ నివాసం ఉండాలని ఆశ పడుతున్నారు. పేద, దిగువ మధ్యతరగతి జనాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
అయితే వీటిపై గత కొన్ని రోజులుగా మేము నిర్మించాం అంటే మేము నిర్మించాం అంటూ తెలుగు దేశం పార్టీ మరియు వైకాపా నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఈ ఫ్లాట్స్ కోసం ఎవరు ఎక్కువ నిధులు కేటాయించారు… పేదలకు తక్కువ ధరకే.. ఇంకా చెప్పాలంటే 300 అడుగులున్న చిన్న ఫ్లాట్స్ ఉచితం ఇచ్చారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 365 మరియు 430 అడుగుల ఫ్లాట్స్ ను సగం ధరకే ప్రజలకు అందించారు . ఇంకా అక్కడ తాగునీరు, రోడ్లు, విద్యుత్ ఇతర సౌకర్యాలకు సైతం భారీగా నిధులు విడుదల చేసిన సీఎం వైయస్ జగన్ ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడం లో కీలక పాత్ర పోషించారు.
మొత్తం ప్రాజెక్టు లో కనీసం పది శాతం కూడా చేయకుండానే అంతా తామే చేసాం అంటూ అక్కడ సెల్ఫీలు దిగి ప్రజలను మభ్యపెడుతున్నారు అంటూ వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఇతర ముఖ్య నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.28 వేల కోట్లపైనే ఖర్చు చేయాల్సి ఉందట. కాని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది సగం కంటే తక్కువే అంటూ అప్పటి లెక్కలు చెబుతున్నారు. అలాంటప్పుడు తామే కట్టేశామని అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటి వరకూ రూ.8734 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఇప్పటికే 62,000 ఇళ్లు పూర్తి చేశారు.
టిడ్కో ఇళ్లు మురికి కూపాలుగా మారి పోకుండా మౌలిక సదుపాయాలు కోసం దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్లు ఇంకా మౌళిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేయడం జరిగింది. అద్భుతమైన నివాస సముదాయాలుగా వాటిని మార్చింది వైకాపా ప్రభుత్వం అంటూ వైకాపా నాయకులు అంటున్నారు. గత ప్రభుత్వం చెల్లించకుండా ఉన్న బిల్స్ రూ.3 వేల కోట్ల బకాయిలు కూడా తీర్చింది వైకాపా ప్రభుత్వం.

YSRCP Government Spent Heavily In Completing Tidco Housing Project
చంద్రబాబు ప్రభుత్వం హయాంలో 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు ఋణం చెల్లించాలి. అంటే ఇరవయ్యేళ్ళ తరువాత ఆ మొత్తం దాదాపు రూ. 7. 2 లక్షలు అవుతుంది. అయితే ఆ 300 అడుగుల ఇంటిని వైయస్.జగన్ ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై భారం రూ. 5,340 కోట్లు అయినా కూడా ప్రభుత్వం ప్రజల కోసం ఆ భారాన్ని భరిస్తోంది.
365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ కూడా ప్రభుత్వం భరించింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం మరో రూ.482.31 కోట్లు పడుతుంది. అంతే కాకుండా ఉచిత రిజిస్ట్రేషన్ రూపంలో రూ.1200 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది. 1,43,600 మందికి ఒక్క రూపాయికే 300 అడుగుల ఫ్లాట్స్ మంజూరు.
సబ్సిడీల రూపంలో రూ. 14,514 కోట్లు మరియు ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్లు. మొత్తం ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 18,714 కోట్లు. అయినా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం తామే అంతా చేశాం అంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వైకాపా శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించినవి 61,948 ప్లాట్స్ తో పాటు ఈ ఏడాది చివరకు అందించే 2, 62, 216 ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించారు. ఇంత క్లీయర్ గా టిడ్కో గృహాల గురించి లెక్కలు ఉన్నా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.