కోర్ట్ లకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడుతున్న వైసీపీ అభిమానులు

Admin - September 27, 2020 / 06:46 AM IST

కోర్ట్ లకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడుతున్న వైసీపీ అభిమానులు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే దాదాపు 100సార్లు కోర్ట్ ల నుండి తాను తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులను అందుకున్నారు. ఇలా కోర్ట్ ల నుండి వైసీపీ ప్రభుత్వానికి అడ్డంకులు వస్తున్నాయని భావిస్తున్న వైసీపీ అభిమానులు కోర్ట్ లకు వ్యతిరేకంగా బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వెనక అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కూడా ఉన్నారని టీడీపీ నాయకులు చెప్తున్నారు.

తాజాగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా న్యాయ వ్యవస్థపై అత్యుత్సాహంతో కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. ఒక ప్రధాన పదవిలో ఉండి కూడా ఇలా రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంటే వైసీపీ అభిమానులు ఇలా ఫ్లెక్సీలు వేయడం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోర్ట్ లు ఎప్పుడు వ్యతిగత నిర్ణయాల వల్ల నిర్ణయాలు తీసుకోవు. కోర్ట్ లు చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ విషయాలు తెలిసి కూడా వైసీపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ అభిమానులు చేస్తున్న ఈ పనుల వెనక జగన్ కూడా ఉన్నారని ప్రతిపక్షాల నాయకులువ్యాఖ్యానిస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us