ఏపీ లో వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం

Advertisement

ఏపీ లో జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తుంది. తాజాగా వైఎస్సార్ చేయూత అనే పథకం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ పథకం 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ మొత్తాన్ని వారికి అందించనుంది ఏపీ ప్రభుత్వం.

అలాగే ఈ చేయూత పథకం ద్వారా 23 లక్షల మంది మహిళలలు లబ్ది చెందుతారని ప్రభుత్వం తెలిపింది. ఈ వైఎస్సార్ చేయూత పథకానికి 4,700 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న మహిళలకు కూడా వరూహించనుంది. దీనితో పెన్షన్‌ కానుక తీసుకుంటున్న ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత మరియు మత్స్యకార మహిళలకూ లబ్ది కలగనుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here