YS Sharmila : బ్రేకింగ్ న్యూస్ : దీక్ష.. పాదయాత్ర భగ్నం.. వైఎస్ షర్మిల అరెస్ట్..

YS Sharmila : వైఎస్ షర్మిల ఇవాళ గురువారం హైదరాబాద్ లో ఉద్యోగ దీక్ష పేరుతో హడావుడి చేయబోతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నాచౌక్ లో దీక్ష చేసేందుకు షర్మిలకి సాయంత్రం ఐదు గంటల వరకే పర్మిషన్ ఇవ్వగా ఆమె ఆ తర్వాత కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మధ్యాహ్నమే ప్రకటించారు. దీంతో ఇచ్చిన సమయం అయిపోయాక పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అయితే ఆమె ఇందిరాపార్క్ నుంచి బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ నివాసానికి నడుచుకుంటూ వెళ్లాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయినప్పటికీ తాను పాదయాత్రగా వచ్చి మళ్లీ దీక్ష కొనసాగిస్తానని షర్మిల తేల్చిచెప్పటం గమనార్హం.

YS Sharmila : ys sharmila arrested after high drama
YS Sharmila : ys sharmila arrested after high drama

స్పృహ తప్పి.. పడిపోయి: YS Sharmila

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల మూడు రోజులు దీక్ష చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ఒక్క రోజే అనుమతించిన పోలీసులు ఆ సమయం పూర్తవటంతో రంగ ప్రవేశం చేశారు. దీక్ష విరమించాలని షర్మిలను కోరారు. అయినా ఆమె వినలేదు. తర్వాత హైడ్రామాకి తెరలేచింది. షర్మిల తన నివాసం లోటస్ పాండ్ కి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సమయంలో ఫ్యాన్స్ మధ్య కాస్త గందరగోళం, తోపులాట జరిగింది. పోలీసులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియాతో ఆ ప్రాంతం మొత్తం నిండిపోయింది. షర్మిల నడుచుకుంటూ ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఒక దశలో ఆమె స్పృహతప్పి పడిపోయారు. కొద్దిసేపటికి మెలకువలోకి వచ్చారు. దీంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement