YS Sharmila : నాకు బైనాక్యులర్ గుర్తు వద్దు.. సీఈసీని ఆశ్రయించిన షర్మిల..!

NQ Staff - October 27, 2023 / 12:03 PM IST

YS Sharmila : నాకు బైనాక్యులర్ గుర్తు వద్దు.. సీఈసీని ఆశ్రయించిన షర్మిల..!

YS Sharmila :

తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు షర్మిల రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తన సొంత పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఎన్నికల గుర్తు కోసం ఆమె అప్లై చేసుకున్నారు. తాజాగా ఆమె పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే దాని మీద ఆమె అసంతృప్తిగా ఉన్నారు.

తనకు బైనాక్యులర్ గుర్తు వద్దని షర్మిల తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆమె నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్నిఆశ్రయించారు. తనకు జనాలు గుర్తించేటటువంటి గుర్తు కేటాయించాలని ఆమె కోరారు. ఇలాంటి గుర్తు పెడితే తనకు ఓట్లు రావని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేయడం అనేది ఆమెకు ఎంతగా కలిసి వస్తుందో తెలియట్లేదు.

వాస్తవానికి ఆమె కాంగ్రెస్ లో చేరి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. ఇప్పుడు పాలేరులో ఆమెకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీగా ఉన్నారు. దాంతో పాటు బీఆర్ ఎస్ పార్టీ కూడా అక్కడ బలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె ప్రజలు గుర్తించే గుర్తుతోనే పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us