YS Sharmila : టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంతా తాలిబన్లే
NQ Staff - December 1, 2022 / 03:55 PM IST

YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కలిసి తనపై జరిగిన దాడి పై ఫిర్యాదు చేశారు. తాను చేస్తున్న పాద యాత్రను అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చూసి తన వాహనంపై, తన కార్యకర్తలపై, తనపై దాడి చేశారని.. తన వాహనాన్ని ధ్వంసం చేశారని షర్మిల ఫిర్యాదుల పేర్కొన్నారు.
గవర్నర్ కి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులను తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ను ఆఫ్గానిస్థాన్ మాదిరిగా మార్చేస్తున్నారని.. తాలిబన్ల మాదిరిగా పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
టిఆర్ఎస్ లో ఉన్న వారందరూ కూడా తాలిబన్ లే అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణమైన పరిపాలన జరుగుతుందని.. పోలీసులను అడ్డు పెట్టుకుని రాక్షస పాలన కొనసాగిస్తున్నారు అంటూ ఆరోపించింది.
తనపై పెట్టిన కేసుకు భయపడేది లేదని.. తన పాదయాత్ర కొనసాగించి తీరుతానని.. అడ్డుకోవాలని చూస్తే ఎంత దూరమైనా వెళ్ళేందుకు సిద్ధమన్నట్లుగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
తన పాదయాత్రలో కేసీఆర్ పరిపాలన గురించి అవినీతిని గురించి ఎన్నికల్లో హామీలు ఇచ్చి నెరవేర్చని పద్ధతి గురించి ఎండగడుతున్న కారణంగానే తన పాదయాత్రను అడ్డుకునేందుకు చూస్తున్నారంటూ షర్మిల ఆరోపించారు.