YS Sharmila : షర్మిల భర్త అనిల్ కుమార్ పై బాబు గోగినేని సెటైర్లు.. అరెస్టును ఆపలేవా అంటూ..!

NQ Staff - May 2, 2023 / 09:26 AM IST

YS Sharmila : షర్మిల భర్త అనిల్ కుమార్ పై బాబు గోగినేని సెటైర్లు.. అరెస్టును ఆపలేవా అంటూ..!

YS Sharmila : నిన్న లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి వద్ద జరిగిన హై డ్రామా గురించి అందరికీ తెలిసిందే. షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ను నెట్టేయడం, ఆ తర్వాత ఎస్సైపై చేయి చేసుకోవడం కూడా చూశాం. దాంతో పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

షర్మిల మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదులు చేశారు. ఇక విజయమ్మ కూడా జూబ్లీ పోలీస్ స్టేషన్ వద్ద మహిళా కానిస్టేబుల్ ను కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే షర్మిల అరెస్టుపై ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ స్పందించారు. కోర్టుకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు.

కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మీడియాతో చెప్పారు. కాగా ఆయన స్పందనపై హేతువాది బాబు గోగినేని సెటైర్లు పేల్చారు. ఏలూరులో వర్షం ఆపిన నువ్వు అరెస్ట్ చేసిన పోలీసులను, చంచల్ గూడ జైలుకు పంపిన కోర్టును యేసు నామముతో ఆపలేకపోయావా అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానిపై కొందరు క్రైస్తవులు మండిపడుతున్నారు. దేవుడిని కించపరిచే విధంగా పోస్టులు పెడుతావా అంటూ కడిగేస్తున్నారు. బాబు గోగినేని గతంలో కూడా ఇలాంటి కామెంట్లు అనేకం చేశాడు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us