YS Sharmila Ready Merge Party With Congress : ఇంకా ఎదురు చూస్తున్న షర్మిల.. కోరుకున్నది కాంగ్రెస్ నుంచి దక్కుతుందా..?
NQ Staff - September 16, 2023 / 12:31 PM IST

YS Sharmila Ready Merge Party With Congress :
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంకా వేచి చూస్తున్నారు. ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని పార్టీ పెట్టిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఇంకా తనకు స్పస్టమైనా హామీలు రాకపోవడంతో కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి షర్మిలా ఇలా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అనుకోలేదు. ఎలాగైనా తన తండ్రి దివంగత వైఎస్సార్ మద్దతు దారులతో కలిసి తన పార్టీని అధికారంలోకి తెలంగాణలో తేవాలని ఆరాటపడింది. పాదయాత్రలు చేసింది. నిరసనలు, సమ్మెలకు అయితే కొదవే లేదు.
ఇంత చేసినా సరే షర్మిల పార్టీకి సరైన మద్దతు లభించలేదనే చెప్పుకోవాలి. దాంతో ఆమె ఒంటరిగా పోరాడితే లాభం లేదని.. తన తండ్రి నడిపించిన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవాలని.. ఆ పార్టీని తాను నేతృత్వం వహించాలన్నది ఆమె కోరిక. ఇప్పటికే రెండు సార్లు ఆమె ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. అయితే ఆమె రాకను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ సినియర్లు మొత్తం షర్మిల వర్గంలోకి వస్తారు. దాంతో రేవంత్ ఏకాకి అయిపోయి.. పార్టీలో గుర్తింపు లేకుండా పోయే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఇప్పటికే సీనియర్లు రేవంత్ ను పట్టించుకోవట్లేదు. వారంతా షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. అందుకే రేవంత్ వర్గం హైకమాండ్ కు షర్మిల విషయంలో అనేక ఫిర్యాదులు చేస్తోంది. కానీ అధిష్టానం షర్మిల అవసరం పార్టీకి ఉందని గుర్తించింది. కాకపోతే ఏపీలో పార్టీ పగ్గాలు ఇస్తామని చెబుతోంది. కానీ అందుకు షర్మిల ఒప్పుకోవట్లేదు. తెలంగాణలోనే తనకు పార్టీలో గుర్తింపు కవాలని పట్టుబడుతోంది. పైగా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కావాలని కూడా షర్మిల బలంగా వాదిస్తోంది. ఈ రెండు డిమాండ్లపై ఇప్పుడు పార్టీ అధిష్టానం ఆలోచనలో పడిపోయింది.
ఇప్పటి వరకు షర్మిలకు స్పష్టమైన హామీలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. కాగా ఇవాళ్ల, రేపు హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకోసం సోనియా గాంధీ, రాహుల్ ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గేలు హైదరాబాద్ చేరుకున్నారు. తుక్కుగూడలో రేపు భారీ బహిరంగ సభ కూడా ఉంది. రేపు షర్మిలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఎందుకంటే షర్మిల తాను కోరుకున్న డిమాండ్లను ఒప్పుకుంటేనే కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందు కోసం షర్మిల వర్గం గట్టిగా పట్టుబడుతోందని తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్ మీద స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల రెడీ అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.