YS Sharmila : పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీయార్ తరం కాదు: వైఎస్ షర్మిల అల్టిమేటం.!
NQ Staff - December 11, 2022 / 09:28 PM IST

YS Sharmila : ‘వైఎస్సార్ బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీయార్ తరం కాదు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రజలకు అందించేవరకు ఈ పోరాటం ఆగదు…’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తూ, వైఎస్ షర్మిల దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆమె దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి నుంచే వీడియో రిలీజ్ చేసిన షర్మిల..
ఆసుపత్రి బెడ్ మీద నుంచే వైఎస్ షర్మిల వీడియో రిలీజ్ చేశారు. గౌరవ హైకోర్టు పాదయాత్రకు అనుమతిచ్చినా కేసీయార్ మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. నిరాహార దీక్ష చేస్తోంటే తనను, తన పార్టీ కార్యకర్తల్ని బంధీలను చేశారనీ, తీవ్రంగా కొట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తమ్మీద, తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యంగా వైఎస్ షర్మిల పాపులారిటీ పెంచుకున్నారు. అయితే, ఈ పాపులారిటీ వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు వైఎస్ షర్మిలకు రాజకీయంగా ఉపయోగపడుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
కాగా, ‘ఏపీలో మీ అన్న వైఎస్ జగన్ చేస్తున్నదేంటి.? రేప్పొద్దున్న నువ్వు తెలంగాణలో చేయబోయేదేంటి.?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు షర్మిలను ప్రశ్నిస్తున్నారు.