YS Sharmila : కాంగ్రెస్ లో వైఎస్సార్‌టీపీ విలీనం.. ఎవరికి ఎంత లాభం?

NQ Staff - June 24, 2023 / 10:05 PM IST

YS Sharmila : కాంగ్రెస్ లో వైఎస్సార్‌టీపీ విలీనం.. ఎవరికి ఎంత లాభం?

YS Sharmila : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో వైఎస్సార్‌టీపీ పార్టీని ప్రారంభించిన విషయం తెల్సిందే. పార్టీ ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర నిర్వహించడం జరిగింది. షర్మిల రాజకీయం ఏ స్థాయిలో చేసిందో మీడియాలో చూశాం.

వచ్చే ఎన్నికల్లో షర్మిల ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది… ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

కాంగ్రెస్ట్‌ పార్టీలో షర్మిల పార్టీ విలీనంకు ముహూర్తం ఖరారు అయ్యిందని.. వేదిక సిద్ధం అయ్యిందని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ వెళ్లి షర్మి కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరపడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదని స్వయంగా ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మధ్య రేవంత్ రెడ్డి ఒక సందర్భంగా మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని తాము అనుకోవడం లేదు.. ఆమె కాంగ్రెస్ పార్టీ లో జాయిన్‌ అయితే లాభం కంటే నష్టం ఎక్కువ అని కొందరు.. పెద్దగా పార్టీకి లాభం లేదు నష్టం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

షర్మిల ఎంతగా చెప్పుకున్నా కూడా ఆమె ను అక్కడ వ్యక్తి అంటున్నారు తప్ప ఇక్కడి వ్యక్తి అనుకోవడం లేదు. కనుక టీ కాంగ్రెస్ కు ఆమె వల్ల ప్రయోజనం ఉండదు అనేది కొందరి వాదన. ఇక షర్మిల యొక్క పార్టీ విలీనం తో కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ లో వైఎస్సాటీపీ విలీనం వల్ల షర్మిలకు ఎక్కువ లాభం.. అంటే తప్ప కాంగ్రెస్ కు పెద్దగా లాభం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కనుక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం విలీనంకు ఓకే చెప్పినా కూడా కండీషన్స్ కు మాత్రం ఓకే చెప్పే అవకాశం లేదు. బే షరతుగా షర్మిల పార్టీని విలీనం చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us