YS Sharmila: షర్మిల ఖమ్మం సభకు కష్టాలు.. ఊహించని షాక్?

YS Sharmila : వైఎస్ షర్మిల… తెలంగాణలో పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ పెడుతున్నట్టు అఫిషియల్ గా ఆమె ప్రకటించారు. కానీ పార్టీ పేరు, పార్టీ విధివిధానాలను ఆమె ఇంకా వెల్లడించలేదు. దాని కోసమే.. షర్మిల తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి… వైఎస్సార్ అభిమానులతో, ఇతర నేతలతో సమావేశమయ్యారు.

ys sharmila meeting in khammam may get cancelled because of covid cases
ys sharmila meeting in khammam may get cancelled because of covid cases

చివరకు… ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి… అక్కడ పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. దాని కోసం అన్ని ఏర్పాటు కూడా చకచకా పూర్తయ్యాయి. పోలీసు శాఖ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు. మార్చి 24నే పోలీసులు షర్మిల సభకు అనుమతి ఇచ్చారు. ఖమ్మం జిల్లా వైసీపీ అధ్యక్షుడు లక్కినేని సుధీర్ సభ కోసం పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఏప్రిల్ 9 న సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు సభను నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు.

కాకపోతే కరోనా నిబంధనలు పాటించి సభ నిర్వహించాలని పోలీసులు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో జనాలను పిలవొద్దని… సుమారు 5 నుంచి 6 వేల మందితో మాత్రమే సభ నిర్వహించాలని.. పోలీసులు తెలిపారు.

YS Sharmila : సభ అనుమతులను పోలీసులను నిరాకరించారా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఎలా వ్యాప్తి చెందుతోందో అందరం చూస్తూనే ఉన్నాం. ఈనేపథ్యంలో కరోనా తెలంగాణలో కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో… బహిరంగ సభకు అనుమతులను పోలీసులు నిరాకరించినట్టు తెలుస్తోంది. దానిపై పోలీసులు… షర్మిలకు నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో… బహిరంగ సభ కాకపోయినా కనీసం ప్రతినిధులతో సమావేశం నిర్వహించుకోవడం కోసమైనా అనుమతులు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు కోరారట. దానికి కూడా పోలీసులు పర్మిషన్ కుదరదని చెప్పినట్టు సమాచారం.

మరి… కరోనా నేపథ్యంలో ఖమ్మం సభ జరుగుతుందా? జరగదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement