YS Sharmila : పిట్టలదొర కొడకా అంటూ కేటీఆర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన షర్మిల
NQ Staff - March 16, 2023 / 06:10 PM IST

YS Sharmila : కామారెడ్డి జిల్లాలోని నాగ మడుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సమయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్‌టిపి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొరకొడకా కేటీఆర్ అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు అంటూ ఆమె ప్రశ్నించింది. 33 ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు నీళ్ళు అందించిన వైయస్సార్ ఎలా తెలంగాణను రోకలి బండతో కొట్టినట్లు అయిందని షర్మిల ప్రశ్నించారు.
రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీలు ఇలా వ్యవసాయానికి ఎన్నో రకాలుగా సహకారాన్ని అందించిన వైయస్సార్ కొట్టి చంపినట్లు అంటూ షర్మిల ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను రుణమాఫీ చేస్తామంటూ రైతులను చంపింది మీ ప్రభుత్వం కాదా అని షర్మిల ప్రశ్నించింది.
ఫీజులు చెల్లించ లేక విద్యార్థులను, పోడు పట్టాలు ఇవ్వకుండా గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది మీ ప్రభుత్వం కాదా అంటూ షర్మిల ప్రశ్నించింది. ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతుంటే ప్రభుత్వం దర్జాగా దోచుకుంటుందని షర్మిల ఎద్దేవ చేశారు.