YS Sharmila : ఏపీలో పార్టీ పెట్ట‌కూడ‌ద‌నే రూల్ లేదు క‌దా.. ష‌ర్మిల సంచ‌లన‌ కామెంట్

YS Sharmila : వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గన్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న‌ వైఎస్ షర్మిల హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పార్టీ పెడుతున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు వైఎస్ షర్మిల వ్యుహాత్మకంగా సమాధానమిచ్చారు.

YS Sharmila comments on ap politics
YS Sharmila comments on ap politics

ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణంగా వైసీపీ తరపున ప్రచారం చేసిన వైఎస్ షర్మిల .. ఇప్పుడు నేరుగా అన్న జగన్ పై రాజకీయ బాణం ఎక్కు పెట్టనున్నారు. దీనిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఎంపీ రఘురామరాజు కూడా వ్యాఖ్యానించారు. త్వరలోనే షర్మిల ఏపీలోకి అడుగు పెడతారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించి .. నిర్మాణంపై ఫోకస్ చేశారు. ఆవేదన యాత్ర, భరోసా యాత్రలతో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఆమె పొలిటికల్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్న జగన్ చెల్లి షర్మిల ఎదురెదురుగా మాట్లాడుకున్న సందర్భం లేదు. దీంతో ఆమె ఏపీలోనూ పార్టీ పెడతారంటూ ప్రాచారం జరిగింది. ఈ అనుమానాలపై తొలిసారి షర్మిల స్పందించారు. ఏపీలో పార్టీ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

దేశంలోని ఏ రాష్ట్రాంలోనైనా పార్టీ పెట్టుకోవచ్చని అన్నారు. ఏపీలో రాజకీయ పెట్టకూడదనే రూల్‌ ఏం లేదు కదా అని ప్రశ్నించారు. తాము ప్రస్తుతం ఒక ఒక మార్గాన్ని ఎంచుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు.ఈ నెల 19 లేదా 20 నుంచి తెలంగాణలో పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్టుగా షర్మిల తెలిపారు. నిబంధనల ప్రకారం యాత్ర నిర్వహిస్తామని చెప్పిన అనుమతి ఇవ్వడం లేదని అన్నారు.

రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే నిబంధనలు అని ఆమో మండిపడ్డారు. బీజేపీ, కేసీఆర్ రెండు ఒక్కటేనని విమర్శించారు. గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విబేధాలు చోటుచేసుకున్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వెళ్లబొతున్నారనే కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.