YS Sharmila Came With Her Son On Occasion Of YSR Jayanthi : షర్మిల కొడుకుని చూసారా.. స్టార్ హీరోలు కూడా పనికిరారు.. ఆరడుగుల కటౌట్ తో..

NQ Staff - July 8, 2023 / 04:46 PM IST

YS Sharmila Came With Her Son On Occasion Of YSR Jayanthi : షర్మిల కొడుకుని చూసారా.. స్టార్ హీరోలు కూడా పనికిరారు.. ఆరడుగుల కటౌట్ తో..

YS Sharmila Came With Her Son On Occasion Of YSR Jayanthi  :

వైఎస్ షర్మిల.. ఈ పేరు తెలియని తెలుగు వారు లేరు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఈయన మరణించి చాలా ఏళ్ళు అవుతున్న ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. అత్యంత ప్రజాధారణ పొందిన రాజకీయ నేతల్లో ఈయన టాప్ లో ఉంటారు. మరి ఈయన కుటుంబం నుండి రాజశేఖర్ రెడ్డి వారసులుగా కొడుకు, కూతురు వచ్చారు.

ఈయన వారసత్వాన్ని నిలుపుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.. తండ్రి మరణం నుండి కోలుకోలేక పోయిన జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిల నిత్యం ప్రజలతో మమేకం అయ్యి ఆయన ఆశయ సాధన కోసం తపన పడ్డారు. షర్మిల కూడా అన్నయ్య కోసం పాదయాత్ర చేసింది. ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయనకు అండగా నిలిచింది.

ఆ తర్వాత ఈమె తెలంగాణ రాజకీయాలపై ద్రుష్టి పెట్టింది. ఇక్కడ యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ పేరుతో పార్టీ స్థాపించి తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలని పాల్పడుతుంది.. వచ్చే ఎన్నికల కోసం భారీ కసరత్తులు చేస్తుంది.. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. షర్మిల అనిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈయన జీసస్ బోధనలు చేస్తుంటారు..

YS Sharmila Came With Her Son On Occasion Of YSR Jayanthi

YS Sharmila Came With Her Son On Occasion Of YSR Jayanthi

మరి ఈ జంటకు ఇద్దరు పిల్లలు.. రాజారెడ్డి, అంజలి.. తాజాగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల తన కుమారుడుతో కలిసి ఇడుపులపాయల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇతడి కుమారుడి ఫోటోలు క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.. ఈయన్ని చుసిన వారంతా అబ్బా కటౌట్ అదిరింది.. ఏమున్నాడురా అంటూ పొగిడేస్తున్నారు. ఇతడు సినిమాల్లోకి రావాలే కానీ స్టార్ హీరోలకు పోటీ ఇస్తాడంటూ చర్చించు కుంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us