తండ్రీ కొడుకులు ఇద్దరికీ నిద్రపట్టని మిస్సైల్ విసిరిన జగన్ మోహన్ రెడ్డి !

ఒక పక్క తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీ లు సమర శంకాలు పూరిస్తుంటే కూతవేటు దూరంలో ఉండి కూడా అసలు తమకేం పట్టనట్టు నిమ్మకుండిపోతున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, అయన వారసుడు లోకేష్ బాబు. ఇదేమి వింతో కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ని తొమ్మిదేళ్ల పాటు పాలించిన కూడా టీడీపీ పెత్తందార్లు ఇప్పుడు సౌండ్ చేయడం లేదు

chandrababu

పీడకలగా గత గ్రేటర్ ఎన్నికలు

చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో, గత గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కి సవాల్ చేసి కొడుకును రంగంలోకి దింపాడు. ఒక వైపు కేసీఆర్ తనయుడు మరోవైపు బాబు తనయుడు లోకేష్ నువ్వా నేను అంటూ పోటీ పడ్డారు. తల ఒక వైపు ప్రచారం చేస్తే లోకేష్ తెచ్చింది ఒక్క సీటు కాగా కేటీఆర్ 99 సీట్లలో మేయర్ పదవిని కైవసం చేసుకున్నాడు. దాంతో చతికిల పడ్డ చంద్రబాబు ఇప్పటి వరకు లేవలేకపోయాడు.

హైదరాబాద్ నిర్మాత

ఏదైనా చెప్పాలంటే చాలు హైదరాబాద్ ని కట్టింది నేనే…పునాది వేసింది నేనే అంటూ డబ్బా కొట్టుకునే బాబు ఇప్పుడు మాత్రం గర్జించలేకపోతున్నారు. టీడీపీ పార్టీని తెలంగాణాలో గాలికొదిలేసి బాబు చోద్యం చూస్తూ రాజభవనం వీడి బయటకు రావడం లేదు. ఇక లోకేష్ బాబు అయితే ఎదో పని మీద హైదరాబాద్ మీదుగా విజయవాడ కి వచ్చి వెళ్తున్నారు. ఇక తెలుగు తమ్ముల్ల్లు మాత్రం మమ్మల్ని బలి పశువులను చేశారని గగ్గోలు పెడుతున్నారు.

జాతీయ పార్టీ పరువు పాయె

అస్సలే తమది జాతీయ పార్టీ..బాబువారు ఏమో జాతీయ అధ్యక్షులు. కానీ తెలంగాణాలో షోకేసులో బొమ్మలా ఆలా పెట్టుకొని కూర్చుకోవడం తప్ప అయన ఏమి చేయలేకపోతున్నారు.మరి వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఎన్టీఆర్ భవనం అయినా అలా బూజు పట్టి పోతుంటే చూసుకోకపోతే ఎలా మాష్టారు అంటూ సెటైర్స్ వేస్తున్నారు ప్రతి పక్షాలు. మరో పక్క తిరుపతి లో ఉప ఎన్నికలు, జిల్లాల విస్తారం, స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ జగన్ హడావిడి పడుతుంటే బాబు మాత్రం ఒక్క మాట మాట్లాడటం లేదు.ఏది ఏమైనా వైస్ జగన్ ని చూస్తూ బాబు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అని చెప్పుకుంటున్నారు అయన సన్నిహితులు.

Advertisement