వామ్మో ఇదేమి అరాచకం : ఒకే ఒక్కడు సినిమా సీన్ రిపీట్ చేసిన జగన్ !

పార్టీ సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డీఆర్‌సీ సమావేశం లో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వీరి గొడవ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లగా ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఐతే వీళ్లిద్దరి వివాద విషయంలో చొరవ తీసుకొన్న వైఎస్ జగన్ ఆధిపత్యపోరు పంచాయతీకి ఎండ్ కార్డు వేశారు. బహిరంగ వేదికలపై వాగ్వాదానికి దిగి వైసీపీ పార్టీ పరువు తీయొద్దు అని సీఎం జగన్  ఎంపీ బోస్, ద్వారపూడి లకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ బోస్ మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన విషయం పై జగన్ స్పందన ఏంటో వెల్లడించారు.

ys jagan

తనని.. ద్వారంపూడిని కూర్చొపెట్టి కాకినాడ మెడ లైన్ వంతెన విషయం గురించి సీఎం చర్చించారని ఎంపీ బోస్ వెల్లడించారు. చంద్రబాబు హయాం లో కాకినాడ మెడలైన్ వంతెన నిర్మాణ విషయంలో అనేక అవినీతి కార్యకలాపాలు జరిగాయని ఆయన అన్నారు.

కాకినాడ మెడలైన్ విషయంలో తన అభ్యంతరాలను పరిశీలించేందుకు ఒక టెక్నికల్ రిపోర్ట్ తెప్పించమని సీఎం ఆదేశించినట్టు ఎంపీ బోస్ తెలిపారు. కాకినాడ డీఆర్సీ మీటింగ్ లో జరిగిన వాగ్వాదం టీ కప్పులో తుపాను వంటిదేనని ఎంపీ బోస్ చెప్పుకొచ్చారు. సొంత పార్టీ నేతలు క్షణికావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఒకరిపై మరొకరు కురిపించడం అనేది చాలా సహజం అని ఆయన అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుందని.. తాను ఆవేశపరుడిని కాను అని ఆయన స్పష్టం చేసారు.

టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే కట్టిస్తున్న అప్పుడు అందులో అవినీతి జరిగే ఆస్కారం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వీళ్లిద్దరి మధ్య జరిగిన తీవ్రమైన వాగ్వాదానికి ఒక్కరోజులోనే పరిష్కారం చూపించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు ఒకే ఒక్కడు సినిమాలోని సన్నివేశం మాదిరి ఉందని వైసీపీ సానుభూతిపరులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఆధిపత్య పోరు విషయంలో వైసీపీ నాయకులు హద్దులు దాటుతూ జగన్ కి తలనొప్పిగా మారుతున్నారు.

Advertisement